ప్రణయ్ హత్యకేసులో కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన రంగనాథ్

-

ప్రణయ్ హత్యకేసులో కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు రంగనాథ్. 9 నెలలు కష్టపడి చార్జ్‌షీట్ దాఖలు చేశామని.. ఏ ఎవిడెన్సు వదల్లేదు అని చెప్పారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. 2018 సెప్టెంబర్ 14 న మిర్యాలగూడలో ప్రణయ్ హత్య జరిగింది. అయితే… ఆ సమయంలో నల్గొండ జిల్ల ఎస్పీగా ఉన్న ఏ.వీ రంగనాథ్.. ఈ కేసును డీల్‌ చేశారు. ఇక తాజాగా ప్రణయ్ హత్యకేసులో కోర్టు తీర్పు ఇచ్చింది. నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.

Ranganath expresses joy over court verdict in Prannoy murder case

ఈ కేసులో ఏ2 గా ఉన్న సుభాష్‌కు ఉరిశిక్ష, మిగిలిన నిందితులకు యావజ్జీవ శిక్ష విధిస్తూ నల్గొండ కోర్టు సంచలన తీర్పు చెప్పింది.ఇక ఈ కేసులో ఏ1గా ఉన్న అమృత తండ్రి మారుతీరావు 2020 మార్చిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, తన కూతురు తక్కువ కాస్ట్ వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుందని అమృత తండ్రి ప్రణయ్‌‌ను సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన పెను సంచలనానికి తెరలేపింది. ఇక తాజాగా ప్రణయ్ హత్యకేసులో కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు రంగనాథ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version