ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొందరు వ్యక్తులు… యాక్టివ్ గా ఉన్నా లేకపోయినా సరే కాస్త ప్రభావం చూపించడం తో పాటుగా వార్తల్లో కూడా నిలుస్తూ ఉంటారు. అందులో ప్రధానంగా చెప్పుకునేది మెగాస్టార్ చిరంజీవి. ఆయన వార్తల్లో ఏదోక రూపంలో వినపడుతూనే ఉంటారు అనేది వాస్తవం. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరంగా బిజెపికి వైసీపీకి దగ్గరగా జరుగుతున్నారు. వాస్తవానికి ఆయన రాజ్యసభ సీటు జగన్ ఇస్తారని భావించారు. కాని కొన్ని కారణాలతో అది వాయిదా పడింది అనే విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు ఆయన బిజెపిలో చేరడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఏపీ రాజకీయాల్లో బిజెపికి బలమైన నాయకుడు అవసరం. వచ్చే ఎన్నికల్లో బిజెపి తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి. దీనితో బిజెపి పొత్తు పెట్టుకుంటే తనకు ఏదైనా పదవి ఏపీలో వస్తుంది అనే ఆశలో కూడా చిరంజీవి ఉన్నారు అనే ప్రచారం జరుగుతుంది. రాజకీయంగా బిజెపి బలపడాలి అంటే చరిష్మా ఉన్న నాయకులు అవసరం. చిరంజీవికి ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి ఆయన ఎంత వరకు నిలబడతారు అనేది చూడాలి.
ఇప్పుడు ఏపీలో రాజ్యసభ సీట్ల సందడి లేదు. కాని బిజెపికి మాత్రం అధ్యక్షుడ్ని మార్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆ పదవి కోసం చిరంజీవి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల చంద్రబాబుని కూడా ఆయన ఎక్కువగా పొగిడారు. ఇది వైసీపీ నేతలకు అసలు ఏ మాత్రం నచ్చలేదు. సినిమాలకు దూరమై మళ్ళీ రాజకీయాలకు దగ్గర కావాలి అనే ఆలోచనలో చిరంజీవి ఉన్నారు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోడికి అన్ని విధాలుగా లాక్ డౌన్ విషయంలో మెగా ఫ్యామిలీ మద్దతు ఇస్తుందనే వార్తలు వినపడుతున్నాయి.