ఎంపీ ర‌ఘురామ వ్య‌వ‌హారంపై సీఐడీకి అనుమానం.. త్వ‌ర‌లోనే యాక్ష‌న్‌?

-

వైసీపీ ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు వ్య‌వ‌హారం ఇప్పుడు ఏపీలో హాట్‌టాపిక్ గా మారింది. ఆయ‌న సీఐడీ విచార‌ణ నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నార‌ని అంతా ఆరోపిస్తున్నారు. అయితే ఆయ‌న మాత్రం స‌హాయ‌కుల‌ను ద‌గ్గ‌ర పెట్టుకుని వీల్ చైర్‌లో తిరుగుతున్నారు. దీంతో ఇప్పుడు సీఐడీకి అవ‌కాశం ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది.

 

కస్టడీలో ఉన్నపుడు తనపై సీఐడీ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఎంపీ ర‌ఘ‌రామ ఆరోపించారు. ఇందుకోసం ఆదివారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇక్క‌డ పాయింట్ ఏంటంటే.. నిజంగానే రెండుపాదాల్లోని సెల్స్ బాగా డ్యామేజి అయ్యాయని, రెండు వారాలపాటు పూర్తిగా రెస్టు తీసుకోవాల‌ని డాక్ట‌ర్లు చెప్పారు.

దీంతో ఆయ‌న సీఐడీ విచార‌ణకు దాన్ని కార‌ణంగా చూపిస్తున్నారు. అయితే ఆయ‌న మాత్రం ఎంచక్కా సీఐడీ అధికారులపై ఫిర్యాదులు చేయటం కోసం అటు ఇటు తిరుగుతునే ఉన్నారు. ఇక్కడే అందరికీ ఎంపీ వ్య‌వ‌హారంపై అనుమానాలు క‌ల్గుతున్నాయి. రెండు పాదాల్లోని సెల్స్ పూర్తిగా పాడైతే ఆయ‌న ఎలా తిరుగుతున్నారు. వీల్ ఛైర్లో తిరుగుతున్నా కేంద్రమంత్రి, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఛైర్మన్ ఆఫీసులో అయినా న‌డ‌వక త‌ప్ప‌దు. దీన్ని ఆస‌రాగా చేసుకుని ఎంపిని సీఐడీ విచారణకు పిలిపించే అవకాశాలు కనబడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version