రాజకీయాల్లోకి వేణుమాధవ్.. కోదాడ నుంచి పోటీ.. ఏ పార్టీనో తెలుసా?

-

తెలుగు కమెడియన్ వేణు మాధవ్ రాజకీయాల్లోకి వస్తున్నాడు. తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల సీజన్ కొనసాగుతోంది కదా. పార్టీలన్నీ ప్రచారం, అభ్యర్థులను ప్రకటించడంపై దృష్టి పెట్టాయి. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమయింది. దీంతో రాజకీయాల్లోకి రావడానికి ఇదే కరెక్ట్ సమయం అనుకున్నాడో ఏమో. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించాడు. కోదాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడట. ఏ పార్టీ తరుపున పోటీ చేస్తున్నాడు అని అంటారా? ఏ పార్టీ కాదు.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అవును.. ఇండిపెండెంట్ గా ఈరోజే నామినేషన్ కూడా వేస్తున్నాడు. వేణుమాధవ్ సొంత ఊరు కోదాడే కావడం… ఆయన అక్కడే పుట్టి పెరగడం, చదువుకోవడం చేయడం వల్ల కోదాడ నుంచి పోటీ చేస్తున్నట్టు ఆయన తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version