హైడ్రా కూల్చివేతలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు గుర్రు.. సీఎం పై ఫిర్యాదు..

-

హైడ్రా కూల్చివేతల విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు.. చెరువులు, కుంటలు, నాళాల పై ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్నారు.. దీనిపై సామాన్య జనం హర్షం వ్యక్తం చేస్తున్నా.. రాజకీయ వర్గాల్లో మాత్రం తీవ్ర వ్యతిరేకత వస్తోంది.. ఇటీవల సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సైతం హైడ్రా కూల్చేసింది. మాజీ మంత్రులు సీనియర్ నేతలకు సంబంధించిన కట్టడాలు సైతం నేలమట్టమవుతున్నాయి.. తనవాళ్లు, పరాయి వాళ్ళు అని భేదం చూడకుండా రేవంత్ రెడ్డి.. అక్రమ కట్టడాలపై ఉక్కు పాదం మోపుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి..

హైడ్రా కూల్చివేతలపై.. ఓ మాజీ కేంద్రమంత్రి అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. తనకు చెందిన నిర్మాణాల్లో సైతం సీఎం రేవంత్ రెడ్డి కూల్చేశారని, సినీ ప్రముఖులు సైతం హైడ్రా కూల్చివేతలపై ఆగ్రహంతో ఉన్నారంటూ ఆయన అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట.. దీంతో ఏఐసీసీ కీలక నేత రేవంత్ రెడ్డిని పిలిచి మాట్లాడారని పార్టీలో ప్రచారం జరుగుతుంది. హైడ్రావల్ల పార్టీకి చెడ్డపేరు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఆయన వ్యాఖ్యానించారు.. అయితే ఇదే సమయంలో అక్కడే ఉన్న రాహుల్ గాంధీ మాత్రం అక్రమ కట్టడాలు కూల్చేయాలని.. దానివల్ల సామాన్యుల్లో పార్టీకి మరింత ఇమేజ్ పెరుగుతుందంటూ సీఎం రేవంత్ రెడ్డికి భరోసా ఇచ్చారట..

రాహుల్ గాంధీ ఇచ్చిన భరోసాతో సీఎం రేవంత్ రెడ్డి మరింత దూకుడుగా వ్యవహరించబోతున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది.. తెలంగాణ అంతటా వర్షాలు కురుస్తున్న కారణంగా హైడ్రా కూల్చివేతల ప్రక్రియ స్లో అయింది.. తిరిగి అక్రమ నిర్మాణాలను కూల్చేసే ప్రక్రియ కొనసాగించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. దీనివల్ల ప్రజల్లో పార్టీకి ఇమేజ్ పెరిగినప్పటికీ.. సీనియర్ నేతల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తోందన్న ప్రచారం జోరందుకుంది.. వారి అసంతృప్తిని రేవంత్ రెడ్డి ఎలా చల్లారుస్తారో చూడాలి మరి..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version