బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి అసెంబ్లీకి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది.. కేంద్ర మంత్రిగా, ఎంపీగా పనిచేసిన ఆమె.. గత ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.. అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలుగా వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు.. తెలుగుదేశం పార్టీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్న నేపథ్యంలో.. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారని చర్చ అన్ని వర్గాల్లో జరుగుతుంది..
ఎన్టీఆర్ కుమార్తెగా ఫేమస్ అయిన దగ్గుపాటి పురందేశ్వరి.. 2004లో బాపట్ల నుంచి లోక్ సభకు పోటీ చేసి గెలుపొందారు.. అనంతరం విశాఖపట్నం నుంచి గెలిచారు.. రాష్ట్ర విభజన అనంతరం పోటీ చేసిన ఆమె ఓటమి పాలయ్యారు.. 2019లో సైతం విశాఖ నుంచి పోటీ చేసి Onglఘోర ఓటమిని చవి చూసారు.. 2014లో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన అనంతరం ఆమె బిజెపిలో చేరారు.. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షురాలుగా కొనసాగుతున్న నేపథ్యంలో..
లోక్సభ నుంచి పోటీ చేస్తారా లేక అసెంబ్లీ నుంచి బరిలోకి దిగుతారా అనే ప్రచారం నడుస్తుంది.. ఒంగోలు జిల్లా రాజకీయాలలో దగ్గుపాటి కుటుంబానికి అభిమానులు ఉన్నారు.. ఈ క్రమంలో ఒంగోలు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని బిజెపి నేతలు చెబుతున్నారు.. ఆమె మాత్రం రాజమండ్రి ఎంపీ లేదా విశాఖపట్నం ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు ఆమె అనుచరులు చెబుతున్నారు.. ఇంతకీ ఆమె మనసులో ఏముందో చూడాలి మరి..