రెండు తెలుగు రాష్ట్రాల్లో కులాల పరంగా రాజకీయం జరిగేది ఏపీలో ఎక్కువ అనే సంగతి తెలిసిందే…తెలంగాణలో కులాల పరంగా పెద్దగా క్యాస్ట్ పాలిటిక్స్ ఉండవనే పరిస్తితి….కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో కూడా కులాల ఆధారంగా రాజకీయం నడవటం పెరిగింది..క్యాస్ట్ ఈక్వేషన్స్ బట్టే కేసీఆర్ కూడా రాజకీయం చేస్తున్నారు. ఇక తెలంగాణ రాజకీయాల్లో రెడ్డి సామాజికవర్గ ప్రభావం కాస్త ఎక్కువనే సంగతి తెలిసిందే…రెడ్లు ఎక్కువగా కాంగ్రెస్ కు సపోర్ట్ గా ఉంటూ వచ్చేవారు. ఇక వారిని ఆకట్టుకోవడానికి కేసీఆర్ అనేక రకాల ఎత్తులతో ముందుకొచ్చి సక్సెస్ అయ్యారు.
అయితే అన్నివేళలా రాజకీయం సక్సెస్ అవ్వాలంటే కష్టం..ఇప్పటివరకు రెడ్లని ఆకర్షించడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు గాని…ఈ సారి మాత్రం ఆయన సక్సెస్ అయ్యేలా లేరు. రెడ్లు ఈ సారి కారు పార్టీ వైపు చూసేలా లేరు…అదే సమయంలో రెడ్డి మంత్రులకు నెక్స్ట్ గెలుపు అవకాశాలు కూడా అంతంత మాత్రమే అన్నట్లు ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన పలు సర్వేల్లో…సబితా, ఇంద్రకరణ్, నిరంజన్ లపై నెగిటివ్ ఎక్కువగా ఉందని తేలింది.