డిస్క‌ష‌న్ పాయింట్ : విస‌న క‌ర్ర నిర‌స‌న ఓవ‌ర్ టు టీడీపీ

-

వినూత్న రీతి నిర‌స‌న‌లు
ఇవ‌న్నీ బాగానే ఉన్నాయి
ఓ ప్ర‌భుత్వం ఛార్జీల పెంపు
అనివార్యం అయినా కాక‌పోయినా
స‌మ‌ర్థ‌నీయం అయితే కాదు
కానీ ప్ర‌జ‌లు మాత్రం
పొదుపున‌కు వాల్యూ ఇస్తున్నారా?
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు
ఆ రోజు ర‌ద్దు చేసిన జ‌గ‌న్ ఎందుక‌ని
తొంద‌ర‌పాటు నిర్ణ‌యాల‌తో విఫ‌లం అవుతున్నారు?
ఆయ‌న స‌రే ! క‌నీస స్థాయిలో విద్యుత్ వినియోగం
త‌గ్గించే ప్ర‌య‌త్నాలు ఎవ్వ‌రైనా చేస్తున్నారా?
ప్ర‌జ‌లు మాదిరి ప్ర‌భుత్వం..,అందుకే ఛార్జీల పెంపు అనివార్యం
ముందు ఉచిత ప‌థ‌కాలు వ‌ద్దు అని ఒక్క‌రైనా రోడ్డెక్కండి
ఆ విష‌య‌మై సామూహిక నిర‌స‌న‌లు చెప్పండి త‌రువాత
ఛార్జీల గురించి ఆ త‌రువాత ప‌న్నుల గురించి మాట్లాడండి

TDP

నిన్న‌టి వేళ విద్యుత్ ఛార్జీలు త‌గ్గించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిర‌స‌న‌లు వ్య‌క్తం చేసింది. విస‌న క‌ర్ర‌ల‌తో లాంత‌ర్ల‌తో వినూత్న రీతిన ప్ర‌ద‌ర్శ‌న‌లు చేసింది. విద్యుత్ ఛార్జీల పెంపుద‌ల పెద్ద‌గా ఏమీ చేయ‌లేద‌ని ప్ర‌భుత్వం వాద‌న ఇదే స‌మ‌యాన విన‌ప‌డింది. ఎవ‌రి వాద‌న ఎలా ఉన్నా కూడా రాజ‌కీయ పార్టీలున్న‌వే వాదోప‌వాదాలు వినిపించేందుకు..ఆ విధంగా విద్యుత్ ఛార్జీల గొడ‌వ మ‌రికొన్ని రోజులు న‌డ‌వ‌నుంది.

ఛార్జీల పెంపు స‌మంజ‌స‌మా కాదా అన్న‌ది అటుంచితే ఇవాళ ఆర్థిక లోటు విప‌రీతంగా ప్ర‌భుత్వాన్ని వేధిస్తోంది. ఇదే స‌మ‌యంలో విద్యుత్ వినియోగానికి, స‌ర‌ఫ‌రాకి ఉత్ప‌త్తికి మ‌ధ్య అగాధం బాగా పెరిగిపోతోంది. విద్యుత్ పొదుపు అన్న‌ది అస్స‌లు అమ‌లులో లేని విష‌య‌మై ఉంది. ఇలాంటి సంద‌ర్భంలో విద్యుత్ ఛార్జీల పెంపు సంగ‌తి అటుంచితే ప్ర‌జ‌ల నుంచి ప్ర‌భుత్వానికి అందుతున్న స‌హ‌కారం ఎంతన్న‌ది చూడాలి.

ముఖ్యంగా విద్యుత్ వృథాను అరిక‌ట్ట‌డం అన్న‌ది ఎప్ప‌టి నుంచో సాధ్యం కావ‌డం లేదు. జ‌ల విద్యుత్ పై ఆధార‌ప‌డినా అది చాల‌డం లేదు. సోలార్ ప‌వ‌ర్ ఇంకా విస్తృత వినియోగంలోకి రాలేదు. ఇదే సంద‌ర్భంలో థ‌ర్మ‌ల్ విద్యుత్ చాలా ఖ‌రీద‌యిన వ్య‌వ‌హారంలా ఉంది. దీంతో విద్యుత్ ఛార్జీల పెంపు ఓ అనివార్యం అయి ఉంది. ఉచిత ప‌థ‌కాలు వ‌ద్దు అని ప్ర‌జ‌లు ఎలా అయితే బ‌య‌ట‌కు చెప్ప‌లేక‌పోతున్నారో అదేవిధంగా ఛార్జీల పెంపు కూడా ప్ర‌భుత్వానికొక స‌వాలుగా మారి ఎందుక‌నో వీటిపై స‌మ‌ర్థ‌నీయ ధోర‌ణిలో త‌న వాద‌న వినిపించ‌లేక‌పోతోంది. రెండు,మూడు ద‌శ‌ల క‌రోనా త‌రువాత ఆర్థికంగా ఏమీ లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. కొంతలో కొంత అప్పుల‌తోనే నెట్టుకువ‌స్తుంది.

విద్యుత్ సంస్థ‌ల‌కు చెల్లించాల్సిన బ‌కాయిలు రెండు వేల కోట్లు ఉన్నాయి.ఇవి త‌క్ష‌ణ‌మే చెల్లించాలి. జెన్ కో కు చెల్లించాల్సిన బ‌కాయి. యూనిట్ ధ‌ర స‌బ్సిడీ పోనూ పెంచిన ధ‌ర కానీ వాస్త‌వానికి ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా కొనుగోలు చేయాల‌న్నా అందుకు ఉన్న ఆర్థిక వ‌న‌రులు ఏవీ అనుకూలంగా లేవు.ఈ ద‌శ‌లో ఛార్జీల పెంపు అనివార్యం అయింద‌ని మాత్ర‌మే ప్ర‌భుత్వం చెప్ప‌గ‌లుగుతుంది కానీ విద్యుత్ పొదుపు పై అవ‌గాహ‌న అయితే తీసుకుని రాలేక‌పోతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version