అసెంబ్లీ రద్దు: కేసీఆర్ రూటే సెపరేట్!

-

ప్రత్యర్ధులకు చెక్ పెట్టే విషయంలో కేసీఆర్ రూటే సెపరేట్ అని చెప్పొచ్చు…పదునైన వ్యూహాలతో రాజకీయం చేసి ప్రత్యర్ధులకు చెక్ పెడతారు…అయితే తన వ్యూహాలు గాని..ప్రత్యర్ధులకు ముందే తెలిస్తే కేసీఆర్ వేరే రూట్ లో వస్తారు…తాజాగా కూడా ముందస్తు ఎన్నికల విషయంలో అలాగే వస్తున్నట్లు కనిపిస్తున్న విషయం తెలిసిందే. తొలిసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్…పూర్తి స్థాయిలో పాలన చేయలేదు…ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగలేదు…2019 ఏప్రిల్ లో జరగాల్సిన ఎన్నికలని ముందుకు జరుపుకుని 2018 డిసెంబర్ లోనే ముగించి ప్రజల మద్ధతు పొంది అధికారంలోకి వచ్చేశారు.

అప్పుడు కేసీఆర్ ముందస్తుకు వెళ్తారని ప్రతిపక్షాలు అస్సలు ఊహించలేదు. ముందు నుంచే కేసీఆర్ …ముందస్తు ఎన్నికలకు ప్రిపేర్ అయ్యి..సడన్ గా ప్రభుత్వాన్ని రద్దు చేసి..ముందస్తు ఎన్నికలకు వచ్చారు. ఇక కేసీఆర్ వ్యూహాలని పసిగట్టలేని ప్రతిపక్షాలు ముందస్తు ముందు బోల్తా కొట్టాయి. దీంతో కేసీఆర్ మళ్ళీ గెలిచి అధికారంలోకి వచ్చారు. అయితే ఈ సారి ప్రతిపక్షాలు అలెర్ట్ అయ్యాయి…గత ఏడాది నుంచే ముందస్తు మాట మాట్లాడుతున్నారు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ సైతం కేసీఆర్ మళ్ళీ ముందస్తుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందుకే ఇప్పటినుంచే ఎన్నికలకు ప్రిపేర్ అవుతూ…పార్టీ శ్రేణులని సిద్ధం చేస్తున్నారు.

 

అటు జాతీయ నేతలు సైతం..కేసీఆర్ ముందస్తుకు వెళ్ళే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు..అయితే టీఆర్ఎస్ నేతలు…ముందస్తుకు వెళ్ళే ఆలోచన లేదని పలుమార్లు చెప్పారు…కేసీఆర్ కూడా ముందస్తు ఆలోచన లేదని అన్నారు…అంటే ఇలా చెప్పి ప్రతిపక్షాలని ఎన్నికలకు రెడీ కాకుండా చేయాలని చూశారు. కానీ కేసీఆర్ కు ముందస్తుకు వెళ్ళే ఆలోచన ఉందని అర్ధమైపోయింది.

అందుకే తాజాగా తన మనసులో మాట బయటపెట్టారు… బీజేపీ వాళ్లకు నిజంగా దమ్ముంటే ముందస్తు ఎన్నికల తేదీని ప్రకటించమనండని చెప్పి..తానే అసెంబ్లీని రద్దు చేస్తానని, అందరం ఎన్నికలకు పోదామని మాట్లాడారు. అంటే ప్రతిపక్షమైన బీజేపీ ఎన్నికల తేదీ చెప్పడం అనేది ఇక్కడ కేసీఆర్ మెలిక…తన ప్రభుత్వం రద్దు చేయాలన్న..ఎన్నికలకు వెళ్లాలన్న కేసీఆర్ చేతుల్లోనే ఉంటుంది..కాకపోతే తెలివిగా బీజేపీని ఎన్నికల తేదీ చెప్పమని అడుగుతున్నారు. ఏదో ఇలా చెప్పి తమకు ప్రజా మద్ధతు ఎక్కువ ఉందని కేసీఆర్…ప్రతిపక్షాలని భయపెట్టాలని అనుకుంటున్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీకి ప్రజా మద్ధతు తక్కువ ఉందని, ఇటీవల పలు సర్వేల్లో తెలుస్తోంది…కాబట్టి కేసీఆర్ ముందస్తుపై మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోంది. చూడాలి మరి కేసీఆర్…ముందస్తుకు వెళ్తారో…లేక వెనక్కి వెళ్తారో?

Read more RELATED
Recommended to you

Exit mobile version