అయ్యన్నో.. మాయన్నో.. మనకు అవసరమా అన్నో..!

-

“అసలే ప్రస్తుతం మన పార్టీ పరిస్థితి అంతంతమాత్రం.. బాబు గారేమో అయితే రూము లేకపోతే జూము.. చినబాబేమో అయితే అమరావతి కాదంటే న్యాయాధిపతి అన్నట్లుగా ఉంది పరిస్థితి! పైగా ఈ సమయంలో అసలు మన పార్టీలో ఉన్నది ఎవరో, ఉండేది ఎవరో తెలియని సందిగ్ధత! ఇన్ని సందేహాల మధ్య సమస్యల మధ్య మనకు ఛాలెంజ్ లూ గట్రా అవసరమా” అని అంటున్నారంట విశాఖ టీడీపీ తమ్ముళ్లు!

అవును… విశాఖ పార్లమెంట్ స్థానంలో ఉన్నవి ఏడు అసెంబ్లీ సీట్లు! వీటిలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల నాటికి టీడీపీకి నాలుగు ఉన్నాయి! అయితే కాలక్రమేనా ఆ నాలుగింటిలో నిన్న వాసుపల్లి గణేష్ కుమార్, రేపు గంటా శ్రీనివాస్, ఎల్లుండు గనబాబు ఫ్యాన్ కింద సేదతీరే ఎమ్మెల్యేలే! అంటే ఉన్న ఏడింటిలో మిగిలింది వెలగపూడి రామక్రిష్ణబాబు! ఇవన్నీ తెలిసి కూడా ఛాలెంజ్ లు అవసరమా అయ్యన్నా అంటున్నారంట తమ్ముళ్లు!

పోనీ ఎవరు లేకపోయినా పర్లేదు సింగం సింగిల్ గా వస్తుంది అందామంటే… తాను పోటీ చేసిన నర్శీపట్నంలోనే పాతిక వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన పరిస్థితి అయ్యన్నపాత్రుడుది! మరి ఏమి చూసుకుని… విశాఖ ఎంపీ సీటు మీద సవాల్ చేస్తున్నారు.. “దమ్ముంటే విశాఖ ఎంపీ సీటుకు ఉప ఎన్నికలు పెట్టించండి.. టీడీపీ గెలిచి చూపించకపోతే అపుడు అడగండి.. అప్పుడు మీరు విశాఖ అంటే విశాఖ, అమరావతి అంటే అమరవతి” అని చెబుతున్నారు ఎందుకు?

పాపం విశాఖలోని టీడీపీ కార్యకర్తలకు అయ్యన్న సవాల్ వెనకనున్న ధైర్యం అర్ధం కాక ఇల బుర్రలు బాదుకుంటున్నారంట! పైగా ఇప్పుడు జనాలకు పూర్తిగా ఇంకా టీడీపీ నాశనం అయిపోలేదనే భ్రమలో ఉన్నారు.. ఈ సమయంలో ఇలాంటి ఛాలెంజ్ లు చేసి డిపాజిట్ లు కోల్పోతే.. అప్పుడు పరిస్థితి ఒకసారి ఊహించుకోండి.. అని సూచిస్తున్నారంట!! మరి అయ్యన్న వింటారా లేక ఇలానే మాట్లాడుతుంటారా అన్నది చూడాలి!! పోనీ అయిపోయిన ఎంపీ ఎన్నికల గురించి ఎందుకు.. రాబోయే విశాఖ మేయర్ ఎన్నికల్లో చూపిస్త్ అయిపోతుందిగా మీ ప్రతాపము… నెటిజన్ల కామెంట్!!

Read more RELATED
Recommended to you

Exit mobile version