ఏపీలో టీడీపీ, జనసేన అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ఇదే

-

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. సీఎం జగన్మోహనరెడ్డి ముందస్తు ప్రకటనతో రాజకీయాలు సైతం వేడెక్కాయి.అభ్యర్థుల వేటలో నిమజ్ఞమయ్యారు వివిధ పార్టీల నేతలు.ఇప్పటికే కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన జనసేన,టీడీపీ లు పలు జిల్లాల్లో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డారు.బీజేపీతో కలిసి 2014 లో మాదిరిగానే పోటీ చేసేందుకు సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చారు. అయితే బీజేపీ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రానున్న ఫిబ్రవరిలో నిర్ణయం ప్రకటించనుంది బీజేపీ హైకమాండ్.

అయితే ఇప్పటికైతే జనసేన,టీడీపీ కలిసి ఈస్ట్ వెస్ట్ తో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలపై ప్రధానంగా ఫోకస్ చేశారు.కొంతమంది అభ్యర్థులను కూడా డిసైడ్ చేసినట్లు సమాచారం. ఇరుపార్టీల అధినేతలు కూర్చుని కొంతమంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మోహమాటలకు పోకుండా రికమెండేషన్లు లేకుండా కేవలం ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేశారు.

ఓసారి ఆ జాబితాను పరిశీలిస్తే…. పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇద్దరు నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. బిడ్డిక దమయంతి లేదా నిమ్మల రామకృష్ణ కు టికెట్ దక్కే అవకాశం ఉంది. పాతపట్నంలో మోమిడి గోవిందరావు,వెంకటరమణ రేసులో ఉన్నారు.

నరసన్న పేటను జనసేనకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో పోటి చేసిన సర్వేశ్వర్‌రావు లేదా ప్రవీణ్‌ కి టికెట్ రావచ్చు. ఇక శ్రీకాకుళంలో శంకర్రావు కి టికెట్ దక్కనుంది.ఇచ్చాపురంని అశోక్‌, పలాస టికెట్ ని గౌతు శిరీష కు కేటాయించారు. టెక్కలి టికెట్ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకి కేటాయించారు. ఆముదాల వలసలో కూన రవికుమార్‌, రాజాంలో మాజీమంత్రి కొండ్రు మురళి, ఎచ్చెర్ల కళా వెంకట్రావ్‌లు పోటీలో ఉన్నారు.

విజయనగరంలో గజపతినగరం టికెట్ జనసేన పార్టీకి కేటాయించినట్లు తెలుస్తోంది.బలమైన అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టాలని చూస్తూన్నారు.పార్వతీపురంలో విజయచంద్ర, చీపురుపల్లిలో కిమిడి నాగార్జున పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి.ఇక విశాఖపట్నం జిల్లాలో అరకు నుంచి దొన్నుదొర,మాడుగుల నుంచి చింతకాయల విజయలకు టికెట్లు ఖరారు అయ్యాయి. మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు ఈ విజయ్.విశాఖ నార్త్‌ ను జనసేనకు ఇచ్చి పంచకర్ల రమేష్‌ ను పోటీలో పెట్టదలచుకున్నారు.

యలమంచిలి జనసేనకు కేటాయించగా విజయకుమార్ ఖరారయ్యారు. భీమిలి నుంచి మాజీమంత్రి గంటా శ్రీనివసారావు, విశాఖ ఈస్ట్‌ వెలగపూడి రామకృష్ణబాబు పోటీలో ఉన్నారు. విశాఖ సౌత్‌ లో బలమైన మత్స్యకార సామాజికవర్గం అభ్యర్థి వేటలో పడ్డారు ఇరు పార్టీల నేతలు. విశాఖ వెస్ట్‌ నుంచి గణబాబు,పెందుర్తి నుంచి మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి పోటీ చేస్తారు. ఇక గాజువాక విషయానికొస్తే ఇక్కడ మళ్లీ పవన్ కళ్యణ్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.2019లో వైసీపీ తరపున గెలిచిన నాగిరెడ్డికి ఇక్కడ వచ్చిన ఓట్లు 75 వేలే.

జనసేనకు 56 వేలు,టీడీపీ అభ్యర్థికి 54 వేల ఓట్లు వచ్చాయి.ఈ రెండు కలిపితే లక్షకు పైగా ఉన్నాయి. ఇప్పుడు వైసీపీకి వణుకు పుట్టుకొచ్చే అంశం ఏమిటంటే ఈరెండు పార్టీలు కలిస్తే వైసీపీ అడ్రస్‌ ఉండదు అనే భయం పట్టుకుంది. ఇక్కడ పవన్ నిలబడకపోతే మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పోటీ చేయొచ్చు.అనకాపల్లి నుంచి గోవింద్‌,పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి,నర్సీపట్నం నుంచి మజీమంత్రి అయ్యన్నపాత్రుడు, పాయకరావు పేట మహిళావిభాగం అధ్యక్షురాలు అనిత,చోడవరం నుంచి మాజీఎమ్మెల్యే ఎస్‌ఎన్‌కే రాజు పోటీ చేస్తారు.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకి సంబంధించి రాజోలులో ఈసారి కూడా జనసేన అభ్యర్ధినే నిలబెట్టనున్నారు. ఒకవేళ జనసేనకు అభ్యర్థి దొరక్కపోతే మాజీమంత్రి గొల్లపల్లి సూర్యరావును టీడీపీ నిలబెడుతుంది.రాజమండ్రి ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఆదిరెడ్డి భవానీ ఉన్నారు. అయితే ఈసారి ఆమె భర్త వాసుకి టికెట్ ఇవ్వనున్నారు. రాజమండ్రి రూరల్‌ లో జనసేన పార్టీ కందుల దుర్గేష్‌ పోటీ చేస్తారు. రాజానగరంలో కూడా జనసేన తరపున బత్తుల బలరామకృష్ణ,అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణరెడ్డి, రంపచోడవరం నుంచి రాజేశ్వరి పోటీ చేస్తారు.తుని నుంచి యనమల రామకృష్ణుడి కుమార్తె దివ్య,ప్రత్తిపాడు నుంచి వరుపుల సత్యప్రభ,జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ ఖరారయ్యారు.

పిఠాపురం జనసేన అధినేత పోటీ చేయాలనే ఆలోచన ఉంది.రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న నియోజకవర్గం ఇది.ఒకవేళ జనసేనాని పోటీ చేయకపోతే పార్టీలో అన్ని తానై చూసుకుంటున్న టీ టైమ్‌ అధిపతి ఉదయ్‌ అవినాష్‌ పోటీ చేస్తారు.పెద్దాపురం మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప,కాకినాడ అర్బన్‌ కొండబాబు, కాకినాడ రూరల్‌లో పంతం నానాజీ పోటీ చేస్తారు. ఇక అమలాపురంలో ఇరుపార్టీల నుంచి అభ్యర్థులు పోటీపడుతున్నారు.టీడీపీ తరపున ఆనందరావు కి టిక్కెట్ దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పిగన్నవరంలో ఇంకా అభ్యర్ధి ఖరారు చేయలేదు.

రామచంద్రాపురంలో రెడ్డి సుబ్రహ్మణ్యం పోటీ చేస్తారు. టీడీపీ పాలనలో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ఆయన ఉన్నారు. శెట్టిబలిజ సామాజికవర్గంలో బలమైన నేత ఈయన. ఇక్కడ విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్‌ మంత్రి వేణుగోపాల కృష్ణకి మధ్య గొడవలు జరుగుతున్నాయి. తన కుమారుడు సూర్యప్రకాష్ ని పోటీలో పెట్టాలని బోస్‌ భావిస్తున్నారు. అయితే బోస్ కి మంత్రి కి మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది. ఒకవేళ వైసీపీ…., వేణుకి టిక్కెట్‌ ఇస్తే సూర్యప్రకాష్‌ని జనసేనకు పంపి జనసేన పార్టీ తరపున రామచంద్రాపురం అభ్యర్ధిగా పోటీలో నిలిపే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరు పోటీపడినా సుబ్రహ్మణ్యం సహకరించే వ్యక్తిగా పేరుంది.ఇక కొత్తపేటలో బండారు స్యతానందరావు, మండపేటలో రేగుళ్ళ జోగేశ్వరరరావు,ముమ్మిడివరం నుంచి దొడ్ల సుబ్బరాజు పోటీ చేస్తారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.2014 ఎన్నికల్లో 15 సీట్లు గెలిచి టీడీపీ రికార్డు సృష్టించింది. అలాగే రెండు పార్లమెంట్ స్థానాలను సైతం టీడీపీ గెలుచుకుంది.ఈ జిల్లాలో ఉన్న భీమవరం స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. ఓటమి చెందిన చోటే మళ్లీ గెలిచి తీరాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నరసాపురంలో మత్య్సకార వర్గానికి చెందిన బొమ్మిడి రాయకర్‌ కి సీటు ఖరారైంది.

తణుకు నుంచి జనసేన తరపున జనసేన విడివాడ రామచంద్రరరావు పేరును పవన్ ఇదివరకే ప్రకటించారు తాడేపల్లిగూడెం లో ఒలిశెట్టి శ్రీనివాస్‌ఖరారు కాగా ఆయన జనసేన నుంచే పోటీ చేటున్నారు.చింతలపూడిలో పీతల సుజాత లేదా ముక్కారావుకి టికెట్ దక్కవచ్చు.పోలవరం నుంచి ఇరుపార్టీల నుంచి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకె మల్లీ టికెట్ ఇవ్వనున్నారు. ఆచంటలో మాజీమంత్రి పితాని సత్యనారాయణ లేదా అప్పలనాయుడు ఉండొచ్చు. ఉంగుటూరు నుంచి గన్ని ఆంజనేయులు,గోపాలపురంలో మద్దిపాటి వెంకటరాజు, ఉండిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామరాజు, దెందులూరు చింతమనేని ప్రభాకర్‌రావు పేర్లు ఫైనల్ అయ్యాయి.ఈ 68 స్ధానాల్లో టీడీపీ, జనసేనలిద్దరూ ఒక అవగాహనకు వచ్చారు. ఎన్నికల నాటికి బీజేపీ కూడా పొత్తుపై స్పష్టమైన ప్రకటన చేస్తే ఈ స్థానాల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version