కారులో రెండు సీట్ల గోల..కేసీఆర్ హ్యాండ్ ఇస్తారా?

-

అధికార టీఆర్ఎస్‌లో సీట్లకు డిమాండ్ ఎక్కువనే సంగతి తెలిసిందే..ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చింది..మూడో సారి కూడా అధికారంలోకి రావాలని చూస్తుంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ లో సీటు కోసం మంచి డిమాండ్ ఉంది..ఒకో సీటులో ఇద్దరు ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇటీవల కేసీఆర్ సిట్టింగులకే సీటు అన్నారు..దీంతో ఆశావాహుల ఆశలపై నీళ్ళు చల్లారు.

అయినా సరే కొందరు తమ ప్రయత్నాలని ఆపడం లేదు..అయితే ఒక సీటు దక్కడమే కష్టంగా ఉన్న సమయంలో కొన్ని ఫ్యామిలీలు రెండు సీట్లు దక్కించుకోవాలని చూస్తున్నాయి. ఇలా రెండు సీట్లు ఆశిస్తున్న వారిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముందున్నారు. తన వారసుడు కార్తీక్ కోసం రాజేంద్రనగర్ అసెంబ్లీ లేదా చేవెళ్ళ ఎంపీ సీటు ట్రై చేస్తున్నారు. ఈ రెండు చోట్ల టీఆర్ఎస్ సిట్టింగులు ఉన్నారు.

ఇక మరో మంత్రి మల్లారెడ్డి..తన అల్లుడుకు గాని కొడుకు గాని మల్కాజిగిరి ఎంపీ సీటు అడుగుతున్నారు. ఇదే సీటు కోసం మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన వారసుడు కోసం ట్రై చేస్తున్నారు. అటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్…తన వారసుడు సాయి కిరణ్ కోసం సికింద్రాబాద్ ఎంపీ సీటు ట్రై చేస్తున్నారు. గత ఎన్నికల్లో సాయి ఇదే సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఇప్పుడు అదే సీటు ఆశిస్తున్నారు. ఈ సీటు కోసం సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్…తన తనయుడు కోసం ట్రై చేస్తున్నారు.

ఇక ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్..తన భర్త శ్యామ్‌కు ఆదిలాబాద్ ఎంపీ సీటు అడుగుతున్నారు. అటు డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఆయన కుమార్తె, మహబూబా బాద్ ఎంపీ కవిత ఉండగా…ఈ సారి తన బదులు తన వారసుడుకు సీటు ఇవ్వాలని రెడ్యా కోరుతున్నారు. ఇలా టీఆర్ఎస్‌లో కొందరు నాయకులు రెండు సీట్లు అడుగుతున్నారు. మరి వీరిలో కేసీఆర్ ఎవరికి హ్యాండ్ ఇస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version