మనపై వస్తోన్న తప్పుడు ప్రచారాన్ని వేగంగా తిప్పికొట్టాలి : కిషన్ రెడ్డి

-

బీజేపీపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆ తప్పుడు ప్రచారాన్ని వీలైనం వేగంగా దూకుడుగా తిప్పికొట్టాలని పార్టీ నాయకులకు సూచించారు. హైదరాబాద్ శామీర్‌పేటలో 3 రోజుల పాటు జరగనున్న బీజేపీ శిక్షణ తరగతులకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రపంచంలో అతిపెద్ద  సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. చిన్నచిన్న భేదాభిప్రాయాలు ఉన్నా అందరం కలిసి పని చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

‘‘బీజేపీపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ విపక్ష పార్టీపై విమర్శలు చేస్తోంది. రాష్ట్రంలో చేసిన పనులు చెప్పుకోలేక టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. సంక్షేమ పథకాలు అపుతామని బెదిరించి మునుగోడులో టీఆర్ఎస్ గెలిచింది. తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడంలో పార్టీ శ్రేణులంతా దూకుడుగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలి’’ అని కిషన్‌రెడ్డి అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌,  రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్‌ ఛుగ్‌, పార్టీ ఎమ్మెల్యేలు, కార్యదర్శులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version