“ఆర్టికల్‌ 174-2 (బీ)  బయటకి తీసి గవర్నర్ ఏపీ అసంబ్లీ రద్దు చేస్తే ? ” !!

-

ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి మాజీమంత్రి యనమల రామకృష్ణ మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై పగ తీర్చుకోవటానికి జగన్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ఎన్నికల ప్రచారంలో ప్రజలను బతిమాలుకొని ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు అని మండలి రద్దు మరియు పునరుద్ధరణ విషయాల గురించి మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వానికి మండలి రద్దు చేయడానికి అధికారం లేదని యనమల పేర్కొన్నారు.

అంతేకాకుండా అసెంబ్లీలో ఆర్టికల్‌-169 కింద తీర్మానం చేసినంత మాత్రాన ఏమీ జరగదన్నారు. మీకు మీ ఇష్టానుసారంగా చేసుకుంటూ పోతే గవర్నర్ పదవిలో ఉన్న వ్యక్తికి ఆర్టికల్‌ 174-2 (బీ) కింద అసెంబ్లీని రద్దుచేసే అధికారం ఉందని ప్రజల ఆలోచనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రభుత్వంపై గవర్నర్ కి చర్యలు తీసుకునే అవకాశం ఉందని శాసనమండలిని రద్దు చేస్తే గవర్నర్ అసెంబ్లీని రద్దు చేయడం వల్ల రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని అప్పుడు తేలిపోతుందని ప్రజలు ఎవరివైపు ఉన్నారో అంటూ యనమల స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో అధికారం ఉంది కదా అని ఎవరికి వారు ఇష్టానుసారంగా చేసుకుంటూ పోతే ప్రభుత్వాలు నిలబడలేవని పేర్కొన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version