రాష్ట్ర మంత్రులు, వాళ్ళ భార్యలు ముచ్చటపడి అగ్రిగోల్డ్ ఆస్తులను కారు చౌకుగా కొట్టేశారన్నారు. కోర్టుకు ఆస్తుల వివరాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోందని, సిఐడి ఇన్వెస్టిగేషన్ రిపోర్టు ఏమైనా చంద్రన్న ఇన్వెస్టిగేషన్ రిపోర్టా అని ప్రశ్నించారు. హ్యాయ్ ల్యాండ్ ను యువరాజు నారా లోకేష్ కారు చౌకుగా కొట్టేద్దామనే కుట్ర జరుగుతోందని, అక్రమార్కులు కుమ్మక్కై అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేద్దామని చూస్తే వదిలిపెట్టమన్నారు. ఈ విషయంపై లోకేష్ తో చర్చకు సిద్ధమా అని సిఎం రమేష్ ట్విట్టర్ లో ప్రశ్నించారని….ఎప్పుడో సమయం చెప్పండి.. నేను లొకేష్ తో చర్చకు సిద్ధం అని ప్రతి సవాల్ విసిరారు.
మోడీని ఫ్యాక్షనిస్టు అంటున్న ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికే ఫ్యాక్షనిజం అంటే ఏంటో బాగా తెలుసన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు లేవనెత్తిన అంశాలపై జీవీఎల్‌ను మీడియా ప్రశ్నించగా.. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అన్ని కుంభకోణాలు, అక్రమాలకు ఆయన మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారని, త్వరలోనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు.