దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ కార్యాలయంలోనే అధికారుల అవినీతిపై విచారణ జరుగుతుండటం సిగ్గుచేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. విజయవాడ దాసరి భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీబీఐని దిగజార్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. రాఫెల్ కుంభకోణం, సీబీఐ అవినీతి, ఇతర అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా రేపు అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నామన్నారు. బిజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఢిల్లీలో గంటసేపు సమావేశం పెడితే అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారం అవుతుందని.. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలంటూ బిజేపీ ధర్నాలు చేయడం రాజకీయ డ్రామాలని ఆయన ఆరోపించారు.
రాఫెల్, సిబిఐలో అవినీతిపై రాష్ట్రవ్యాప్త నిరసన : సిపిఐ రామకృష్ణ
-