కౌశిక్‌రెడ్డి చేరిక‌కు లైన్ క్లియ‌ర్ అయిందా.. అప్పుడేనా చేరేది..?

-

రాష్ట్ర‌రాజ‌కీయాల్లో ఇప్పుడు కౌశిక్‌రెడ్డి అనే పేరు ఎంత‌లా మార్మోగి పోతుందో అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న అనూమ్యంగా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి రేవంత్ మీద సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం అంద‌రికీ విదిత‌మే కాగా ఆయ‌న ఇత‌కుముందు హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన విష‌యం కూడా తెలిసిందే. కాగా ఆయ‌న ఇప్పుడు టీఆర్ ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం అయిన‌ట్టు స‌మాచారం.

కౌశిక్ రెడ్డి టీఆర్ ఎస్ లో చేరే విష‌య‌మై ఇప్ప‌టికే ఎన్నో మ‌లుపులు తిరిగాయి. ఇక ఇప్పుడు కూడా టీఆర్ ఎస్ కూడా మొన్న‌టి దాకా కాస్త అనుమానం ప‌డింది. ఎందుకంటే వివాదాలకు కేంద్రంగా ఉన్న కౌశిక్‌రెడ్డిని చేర్చుకుంటే ఇమేజ్ దెబ్బ‌తింటుందేమో అని అనుమానం వ్య‌క్తం చేశారు.

కానీ ఇప్పుడు కౌశిక్ రెడ్డి చేరిక‌కు ముహూర్తం కూడా దాదాపుగా ఖరారు అయినట్టు స‌మ‌చారం వ‌స్తోంది. ఎప్పుడో కాదు ఈ నెల జులై 21వ తేదీన కౌశిక్ రెడ్డి టీఆర్ ఎస్ కండువా క‌ప్పుకుంటార‌ని సమాచారం. హుజురాబాద్ నియోజకవర్గంలోని కౌశిక్ రెడ్డి త‌న‌కు ఉన్న అనుచరులతో క‌లిపి పెద్ద ఎత్తున 2వేల మందితో కలిసి ఆయన టిఆర్ ఎస్ పార్టీలో చేరనున్నారు. ఇంకా చెప్పాలంటే టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకుంటార‌ని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version