కుప్పంలో బాబు…ఈ సారి ఓటమిని తప్పిస్తారా?

-

ఎట్టకేలకు చంద్రబాబు…కుప్పంలో అడుగుపెట్టారు. గత కొన్ని నెలలుగా కుప్పంలో రాజకీయాలు పూర్తిగా మారిన విషయం తెలిసిందే. అనూహ్యంగా ఇక్కడ వైసీపీ పైచేయి సాధిస్తూ వస్తుంది. అసలు చంద్రబాబుకు కంచుకోటగా ఉన్న కుప్పంలో వైసీపీ పైచేయి సాధించడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. అసలు కుప్పం అంటే చంద్రబాబు అడ్డా..మొదట నుంచి కుప్పంలో బాబు సత్తా చాటుతూనే వస్తున్నారు. కుప్పంలో తన సొంత సామాజికవర్గం కమ్మ ఓట్లు 2 శాతం కూడా లేకపోయినా సరే…కుప్పం నియోజకవర్గంలో బాబు సత్తా చాటుతున్నారు.

1989 నుంచి 2019 వరకు వరుసగా ఏడుసార్లు విజయం సాధించారు. అయితే నెక్స్ట్ ఆ ఛాన్స్ ఇవ్వకూడదని వైసీపీ ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం టార్గెట్‌గా రాజకీయ వ్యూహాలు పన్నుతూ అక్కడ టీడీపీని దెబ్బ వీక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో చాలావరకు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అనూహ్యంగా బలమైన టీడీపీ క్యాడర్‌ని తమ వైపుకు తిప్పేసుకున్నారు.

అలాగా ఊహించని విధంగా పంచాయితీ ఎన్నికల్లో టీడీపీని చిత్తు చేశారు. దాదాపు 90 శాతం పంచాయితీలు వైసీపీ గెలుచుకుని టీడీపీకి షాక్ ఇచ్చింది. అలాగే ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో సైతం సత్తా చాటింది…ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రభావం చూపలేకపోయింది. దీంతో కుప్పంలో చంద్రబాబు పని అయిపోయిందని, నెక్స్ట్ ఆయన గెలవడం కష్టమని చర్చలు మొదలయ్యాయి. కొడాలి నాని లాంటి వారైతే కుప్పంలో బాబు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. అంటే కుప్పంలో పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇక ఆ పరిస్తితులని చక్కదిద్ది, మళ్ళీ టీడీపీని గాడిలో పెట్టడానికే చంద్రబాబు కుప్పంలో ఎంట్రీ ఇచ్చారు. అక్కడ నేతలని, కార్యకర్తలని సమన్వయం చేసి, మళ్ళీ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. పైగా త్వరలోనే కుప్పం మున్సిపాలిటీకి ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలో పార్టీ గెలవడానికి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఈ సారి ఎలాగైనా పెద్దిరెడ్డికి చెక్ పెట్టి కుప్పంలో టీడీపీని ఓటమి నుంచి బయటపడేయాలని బాబు చూస్తున్నారు. మరి చూడాలి బాబు ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version