తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పొలిటికల్ కెరియర్ ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీ పదవి చేపట్టి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టిన నారా లోకేష్ తండ్రి చంద్రబాబు హయాంలో అనతికాలంలోనే మంత్రి అవ్వడం జరిగింది. అయితే చాలా సార్లు బహిరంగంగా మీడియా సమావేశాల్లో నారా లోకేష్ ఎన్నికల సమయంలో ప్రచారంలో ప్రసంగిస్తున్న సమయంలో నవ్వుల పాలు కూడా అవ్వడం జరిగింది.
దీంతో నారా లోకేష్ రాజకీయాలకు పనికి రారు అన్న ముద్ర పడిపోయింది. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న తరుణంలో నారా లోకేష్ ఇటీవల పార్టీ తరఫున మరియు ప్రజా సమస్యల తరఫున తనదైన శైలిలో స్పందిస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా సోషల్ మీడియాలో తన పై జరుగుతున్న దాడిని తిప్పికొడుతూ అదరగొట్టే రాజకీయం చేస్తున్నాడు. గతంలో మాదిరిగా కాకుండా రాజకీయాల్లో పరిణితి చెందిన వాడిలా జగన్ మాదిరిగా లోకేష్ రాజకీయాలు చేస్తున్నట్లు టిడిపిలో పెద్దలు మాట్లాడుకుంటున్నారు.
అయితే జగన్ అంత కావాలి అంటే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో లోనే ఉండి జగన్ మాదిరిగా పాదయాత్ర చేస్తే కనుక తెలుగుదేశం పార్టీ భవిష్యత్ రాజకీయ వారసుడిగా తెలుగు రాజకీయాల్లో కచ్చితంగా పొలిటికల్ కెరియర్ వుంటుందని అలాగే మీడియా ముందు మాట్లాడే సమయంలో ఆచితూచి మాట్లాడితే ఇంకా బాగుంటుందని ఎదురులేని రాజకీయ జీవితం లోకేష్ కి సొంతమవుతుందని రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.