హైదరాబాద్ ‘కారు’లో రచ్చ..సెట్ చేస్తారా? ముంచేస్తారా?

-

అన్నీ వర్గాల ప్రజలు..తెలంగాణతో ఏపీ, ఇంకా పక్కనే ఉన్న ఇతర రాష్ట్రాల ప్రజల కలయికతో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో రాజకీయం ఈ సారి రసవత్తరంగా సాగేలా ఉంది. మొదట నుంచి ఇక్కడ రాజకీయ పోరు ఆసక్తికరంగానే ఉంటుంది.ఏ పార్టీకి విజయం వన్ సైడ్‌గా దక్కదు. గత కొన్ని ఎన్నికల్లో ఇక్కడ త్రిముఖం లేదా చతుర్ముఖ పోరు కూడా నడుస్తుంది. ఈ సారి కూడా అలాంటి పరిస్తితి ఉంది.

ఇక గత ఎన్నికల మాదిరిగా బి‌ఆర్‌ఎస్ పార్టీకి అంత ఈజీగా విజయాలు అందడం కష్టమనే చెప్పాలి. ఈ సారి కాంగ్రెస్, బి‌జే‌పిల నుంచి గట్టి పోటీ ఎదురుకోవాల్సి వస్తుంది. అదే సమయంలో సొంత పార్టీలో ఉండే అంతర్గత విభేదాలు కారు పార్టీకి కాస్త ఇబ్బందిగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా కారు పార్టీలో చాలా స్థానాల్లో అంతర్గత పోరు ఉన్న విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున సీటు కోసం పోటీ నెలకొంది. ఒకరికి సీటు ఇస్తే మరొకరు వేరే పార్టీలోకి జంప్ అయిపోవడమా లేదా సహకరించకపోవడం చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇక హైదరాబాద్ పరిధిలో బి‌ఆర్‌ఎస్ లో రచ్చ ఎక్కువగానే ఉంది. కుత్బుల్లాపూర్ లో ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజుల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. వీరి మధ్య సీటు విషయంలో పంచాయితీ నడుస్తుంది. అటు మహేశ్వరంలో మంత్రి సబితకు బదులుగా తనకే టికెట్‌ ఇవ్వాలంటూ తీగల కృష్ణారెడ్డి పట్టుబడుతున్నారు. రాజేంద్రనగర్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌ తో టికెట్‌ కోసం ఎంపీ రంజిత్‌రెడ్డి పోటీ పడుతున్నారు.

ఖైరతాబాద్‌లో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఉన్నప్పటికీ.. మన్నె గోవర్ధన్‌రెడ్డి, దాసోజు శ్రవణ్‌ టికెట్‌ దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. ఉప్పల్‌లోనూ బేతి సుభా్‌షరెడ్డి ఉండగానే.. మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఎమ్మెల్యే టిక్కెట్‌ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. అంబర్‌పేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి వర్గాల మధ్య పోరు ఉంది.  ఇలా సీటు కోసం రచ్చ నడుస్తుంది. ఈ రచ్చకు బ్రేక్ వేయాల్సి ఉంది. లేదంటే బి‌ఆర్‌ఎస్ పార్టీకే నష్టం.

Read more RELATED
Recommended to you

Exit mobile version