చంద్ర‌బాబు ప్లాన్ చేస్తే సీన్ వేరేలా ఉండేది: మంత్రి సోమిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

-

అమ‌రావ‌తి: విశాఖ ఎయిర్‌‌పోర్టులో జగన్‌పై జరిగిన దాడి ఘటనపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పిల్ల కుంకతో హత్య ప్లాన్ చేస్తాడా అని అన్నారు. తాము నిజంగా ప్లాన్ చేస్తే ఇలా గిచ్చుకోవటాలు గుచ్చుకోవటాలు ఉండవని…ప్లాన్ చేయాలనుకుంటే రాజారెడ్డి, వైఎస్, జగన్ తరహాలోనే చేస్తామని వ్యాఖ్యానించారు. కానీ అలా చేసే ఆలోచనలు తమవి కావని మంత్రి సోమిరెడ్డి స‌ర్దిచెప్పుకునే ప్ర‌య‌త్నం చేశారు.

జగన్‌కు అరసెంటీమీటర్ గాయానికి గవర్నర్ విచారణ చెయ్యాలా? అని ప్రశ్నించారు. ఒక గవర్నర్ 12 ఏళ్లుగా ఒకే చోట ఉన్న సందర్భం ఉందా అని ఆయన నిలదీశారు. నరసింహన్‌పై కేంద్రానికి ఎందుకింత ప్రేమ అని అన్నారు. దాడి విషయంలో వైసీపీ కేంద్రాన్ని ఒక్క మాట అనడం లేదని మండిపడ్డారు. విశాఖలో కుట్లు వేసే డాక్టర్లే లేరా…దానికి హైదరాబాద్ వరకు వెళ్లాలా? అని ప్రశ్నించారు. కేంద్ర డ్రామాలో సీఐఎస్‌ఎఫ్‌ కూడా సహకరించిందా అని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అనుమానం వ్య‌క్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version