ద‌ళిత బంధు అమ‌లు చేయ‌క పోతే చావు డ‌ప్పు మోగిస్తారు : ఈట‌ల‌

-

ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని రాష్ట్ర వ్యాప్తం గా అమ‌లు చేయ‌క పోతే ప్ర‌గ‌తి భ‌వ‌న్ ముందు చావు డ‌ప్పు మోగిస్తార‌ని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంధ‌ర్ అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని న‌వంబ‌ర్ 4 నుంచే అమ‌లు చేస్తాన‌ని హామీ ఇచ్చార‌ని గుర్తు చేశారు. కానీ డిసెంబ‌ర్ 4 దాటిన ఇంకా అమ‌లు చేయ‌లేద‌ని విమ‌ర్శించారు. అయితే ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని రాష్ట్ర వ్యాప్తం గా అమ‌లు చేయక పోతే సీఎం కేసీఆర్ తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొంటార‌ని విమ‌ర్శించారు.

అలాగే రాష్ట్ర వ్యాప్తం గా ఉన్న ద‌ళితులు ప్ర‌గ‌తి భ‌వ‌న్ కు వ‌చ్చి మ‌రీ చావు డ‌ప్పు మోగిస్తార‌ని అన్నారు. అయితే ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ప్రారంభించి చాలా రోజులు గ‌డుస్తున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ ప‌థ‌కాని కి సంబంధించిన విధి విధానాల‌ను ప్ర‌క‌టించ‌లేద‌ని విమ‌ర్శించారు. ఈ ప‌థకం ద్వారా వ‌చ్చే డ‌బ్బు ఎలా వ‌స్తాయ‌ని.. వాటిని ఎలా వినియోగించాల‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేయాల‌ని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version