దేశ రాజకీయాలు: గెలుపే లక్ష్యంగా NDA సమావేశంలో కీలక చర్చలు !

-

ఈ రోజు బెంగుళూరు లో INDIA కూటమి రెండు రోజుల మీటింగ్ పూర్తి అయిన విషయం తెలిసిందే. ఈ కూటమి మీటింగ్ పూర్తి అయ్యాక ఢిల్లీ లో NDA కూటమి సమావేశం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ మీటింగ్ కు ప్రధాని మోదీ, కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా లతో పాటుగా దేశ వ్యాప్తంగా ఉన్న 30 కి పైగా మిత్రపక్షాలు హాజరయినట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశ్యం దేశంలో వరుసగా మూడవసారి అధికారంలోకి రావడమే అని స్పష్టంగా అర్ధమవుతోంది. ఇక ఈ మీటింగ్ లో గత 9 సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను మరియు మైళ్ళు రాయిల గురించి నడ్డా అందరికీలే వివరించారు. ఇక ముఖ్యంగా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పార్టీని ఎలా ముందుకు నడిపించి విజయం దిశగా తీసుకువెళ్లాలి అన్న విషయం పైన ప్రధాని మోదీ నేతలతో మాట్లాడనున్నారు.

ఈ రోజు దేశంలో రెండు కీలక పార్టీలు మీటింగ్ లు పెట్టగా , ఏ సమావేశానికి మంచి స్పదన ఉంటుంది అన్నది తెలియాల్సి ఉంది. కాగా రాబోయే ఎన్నికల్లో పోటీ NDA మరియు INDIA కూటముల మధ్యనే ఉండనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version