ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి ఏపీ రాజకీయాల్లో ఈవిడ గురించి పెద్దగా తెలియని వారు ఉండరు. ముఖ్యమంత్రి జగన్ మీద ఈమెకు ఉన్న అభిమానం. ఆమె చేసిన టిక్ టాక్ వీడియో, అసెంబ్లీలో మాట్లాడే మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆమె వరుసగా రెండో సారి ఎంపిక అయ్యారు.
పుష్ప శ్రీవాణి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనగా… ఆ కార్యక్రమంలో మంత్రి పుష్పశ్రీవాణిని వేదిక మీదకు పిలిచారు… కాని ఆమె పక్కనే ఆమె భర్తను మాత్రం వేదిక మీదకు పిలవలేదు. దీంతో ఆమె కన్నీరు పెట్టుకున్నారు. తన ముందు తన భర్తను కనీసం స్టేజీ మీదకు పిలవకపోవడంతో ఆమె అలా చూస్తుండిపోయారు. పుష్పశ్రీవాణి కన్నీళ్లు పెట్టుకోవడం చూసిన వైసీపీ నాయకులు వెంటనే పుష్పశ్రీవాణి భర్తను స్టేజీ మీదకు పిలిచారు.
కురుపాం నియోజకవర్గం నుంచి ఎంపిక అయిన ఆమె ప్రతిభ గల మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. పార్టీ నాయకులతో పాటు నియోజకవర్గ ప్రజలలో కూడా ఆమెకు మంచి పేరు ఉంది. అయితే ఆమె ఎస్టీ కాదంటూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం న్యాయ సలహాదారు రేగుమహేశ్, అఖిల భారత దళిత హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మణిసింగ్ పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ముత్యాలరాజుకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెంలో జన్మించిన పుష్పశ్రీవాణి గిరిజన వ్యక్తి కాదని.. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న విధంగా ఆమెది కొండదేవర తెగ కాదు అంటూ ఫిర్యాదు చేసారు.