రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేవి సర్వసాధారణం. ఎలాంటి ఉద్ధండ నాయకుడికైనా కూడా ప్రజా క్షే త్రంలో గెలుపు ఉంటుంది. అదేసమయంలో ఓటమి కూడా ఉంటుంది. ఈ రెండింటిలోనూ ఏది వచ్చినా ఆనందించినప్పుడు, ప్రజలతో మమేకం అయినప్పుడే నాయకుడిగా ఎవరికైనా గుర్తింపు, జీవిత కాలం.. ప్రజల్లో మన్నన ఉంటుంది. అయితే, నేటి తరం నాయకులకు ఈ ఓర్పు, నేర్పు, సహనం, ప్రజలతో మమేకం కావడం అనే విషయాల్లో ఎక్కడా పొంతన ఉండడం లేదు. ఎన్నికల్లో గెలిస్తే.. సొంత వ్యవహారాలు చేసుకోవ డం, అడపా దడపా ప్రజల మద్య ఉండడం, ఓడిపోతే.. పూర్తిగా తెరమరుగు కావడం అనేది పరిపాటిగా మారింది.
ఇప్పుడు చాలా మంది రాజకీయ నేతలు ఇదే బాటలో ఉన్నారు. ఉత్తరాంధ్రలో బొబ్బిలి రాజులుగా ప్రసిద్ధి పొందిన విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన సుజయ కృష్ణరంగారావు, ఆయన సోదరుడు బే బినాయనలు ఇప్పుడు ఇదే తరహా పరిస్థితిలో ఉన్నారు. కాంగ్రెస్‌తో రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనప్ప టికీ.. వైసీపీలో దూకుడుగా రాజకీయాలు చేసిన చరిత్ర వీరికి ఉంది. 2014 ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై సుజ య కృష్ణరంగారావు తర్వాత కాలంలో టీడీపీకి జైకొట్టారు. మంత్రి పదవిపై వ్యామోహంతో ఆయన జగన్‌కు దూరమయ్యారు.
టీడీపీలోకి ఏ లక్ష్యంతో వెళ్లారో దానినైతే సాధించారు. మంత్రి అయ్యారు. గనుల శాఖలో గడిచిన చంద్రబాబు పాలనలో రెండుసంవత్సరాలు చక్రం తిప్పారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. పార్టీ మార్పు.. తర్వాత జగన్‌పై విమర్శలు చేయడం వంటివి సుజయ్ కి ప్రజ ల నుంచితీవ్ర వ్యతిరేకతను మూటగట్టేలా చేసింది. ఫలితంగా 2019లో ఆయన టీడీపీ తరఫున పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఇక, అప్పటి నుంచి కూడా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. టీడీ పీ రెండోసారి అధికారంలోకి రాకపోవడం, పార్టీ పరిస్థితి కూడా దారుణంగా ఉండడం, ఈ నేపథ్యంలోనే ఇప్పు డు టీడీపీ తరఫున ఉండాలా? వద్దా? అనే సందేహంలో పడిపోయారు.
అంతేకాదు, వైసీపీ వైపు దృష్టి సారిస్తున్నారు. కానీ, ఇప్పుడు ఆయనను ఆహ్వానించే పరిస్థితి లేదు. పైగా ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు, శ్రేణులు కూడా వైసీపీ బాట పట్టారు. దీంతో సుజయ్ పరిస్థితి ఒంటరిగానే మారిపోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వెనుదిరిగి చూసుకుంటే.. జంప్ జిలానీ అనే పేరు తప్ప సాధించింది ఏమీ లేదని అంటుండడం చెప్పుకోదగ్గ విశేషం.