కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, అంబటి రాంబాబు..వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతలు..టిడిపిపై విరుచుకుపడే నాయకులు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబుపై ఒంటికాలి మీద వెళ్ళే వారు..బాబుని ఎప్పటికప్పుడు తెగ తిడుతూ..టిడిపికి చెక్ పెడుతుంటారు. అందుకే వీరు అంటే టిడిపి శ్రేణులకు బాగా కోపం ఉంటుంది. ఎలాగైనా వీరిని ఓడించాలని వారు కసితో ఉన్నారు.
చంద్రబాబు సైతం వీరిని ఓడించడానికి సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. వారిపై బలమైన అభ్యర్ధులని నిలబెట్టాలని చూస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్న రోజాపై నగరిలో టిడిపి నుంచి గాలి భాను ప్రకాష్ పోటీ చేయనున్నారు. ఈ స్థానంలో మార్పు లేదు గాని..మిగిలిన ముగ్గురు స్థానాల్లో మార్పులు ఉన్నాయి. గుడివాడలో తిరుగులేని బలంతో ఉన్న కొడాలికి చెక్ పెట్టడానికి కొత్త అభ్యర్ధిని రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయి.
ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావు కాకుండా..ఎన్‌ఆర్‌ఐ వెనిగండ్ల రాముకు సీటు ఇస్తారని టాక్. కానీ ఇది పూర్తిగా ఫిక్స్ కాలేదు. అటు టిడిపి నుంచి వైసీపీలోకి బాబుని తిడుతున్న వంశీకి గన్నవరంలో చెక్ పెట్టేందుకు బలమైన నేతని రంగంలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సీటులో పలువురు నేతలు పోటీ పడుతున్నారు. దేవినేని అపర్ణ, పట్టాభి లాంటి వారు సీటు ఆశిస్తున్నారు. అటు గద్దె అనురాధా సైతం రేసులో ఉన్నట్లు తెలుస్తుంది.
ఇక వైసీపీలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావు టిడిపిలోకి వచ్చి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం వస్తుంది. ఏదేమైనా ఇక్కడ బలమైన నేతని పోటీలోకి దింపాలని చూస్తున్నారు. అటు సత్తెనపల్లిలో అంబటిపై పోటీకి పలువురు టిడిపి నేతలు పోటీ పడుతున్నారు..కానీ కన్నా లక్ష్మీనారాయణని ఫిక్స్ చేశారు. ఆయనే బరిలో దిగనున్నారు. అయితే రోజా, రాంబాబు విషయం ఏమో గాని కొడాలి, వంశీలకు చెక్ పెట్టడం బాబుకు సాధ్యం అవ్వడం కష్టమే.