బీజేపీకి జితేందర్ రెడ్డి గుడ్‌బై..ట్వీట్ సారాంశం అదే.?

-

తెలంగాణ బీజేపీలో కల్లోలం చెలరేగుతుంది. ఆ పార్టీలో అంతర్గత పోరు ఊహించని విధంగా బయటపడుతుంది. ఇప్పటికే రాజకీయంగా రేసులో వెనుకబడ్డ బి‌జే‌పి..ఇప్పుడు అంతర్గత పోరుతో ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా బి‌జే‌పి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తోనే చిక్కులు వస్తున్నాయి. ఆయన నాయకత్వాన్ని చాలామంది బి‌జే‌పి నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం…బండికి యాంటీగానే ఉన్నారని తెలుస్తుంది.

బండి అందరినీ కలుపుకుని వెళ్ళడం లేదని అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. ఈ క్రమంలోనే ఆయన్ని మార్చాలని ఈటల, కోమటిరెడ్డి పట్టుబడుతున్నట్లు తెలుస్తుంది. లేదంటే పార్టీ కూడా వీడిపోతారని ప్రచారం వస్తుంది. అయితే బండిని మార్చే ప్రసక్తి లేదని బి‌జే‌పి అధిష్టానం తేల్చేసింది. ఈ క్రమంలోనే సీనియర్ నేత, మాజీ ఎం ఓ చిన్న వీడియో ద్వారా తెలంగాణ నాయకత్వంపై జితేందర్‌రెడ్డి తన అసంతృప్తినంతా వెళ్లగక్కారు. అసలు ఆ వీడియోలో ఏముందంటే.. ఓ వ్యక్తి దున్నపోతును ట్రాలీలో ఎక్కించడానికి ట్రై చేస్తుంటాడు. అది ఎక్కకుంటే వాటి సీటుపై ఒక్క తన్ను తంతాడు. వెంటనే అది ట్రాలీ ఎక్కుతుంది. సేమ్ టు సేమ్ ట్రీట్‌మెంట్ తెలంగాణ బీజేపీ నాయకత్వానికి కూడా అవసరమని జితేందర్ రెడ్డి ఒక పోస్ట్ పెట్టారు.

ఈ ట్వీట్‌ను అమిత్‌ షా, బీఎల్‌ సంతోష్‌, సునీల్‌ బన్సాల్‌ లాంటి అగ్రనేతలకు ట్యాగ్‌ చేశారు. కానీ జితేందర్ రెడ్డి కాసేపటికే ఆ పోస్టును డిలీట్ చేశారు. ఆ వెంటనే “కేసిఆర్ సోషల్ మీడియా ఊరకుక్కలకు తెల్వాల్సిన ముచ్చట ఏంటిదంటే… బండి సంజయ్ గారి నాయకత్వాన్ని ప్రశ్నించేటోళ్లకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్నో చెప్పే ప్రయత్నాన్ని తప్పుగ అర్థం చేసుకునే ఊరకుక్కల్లార… బిస్కెట్ల కోసం బరితెగించకుర్రి” అంటూ మరో ట్వీట్ చేశారు.

అంటే ముందు ట్వీట్ లో తప్పు దొర్లిందని..మళ్ళీ సరిచేసుకున్నట్లు చెప్పి..బి‌ఆర్‌ఎస్ పై ఫైర్ అయ్యారు. కానీ అంతర్గతంగా బండిపై జితేందర్ రెడ్డికి అసంతృప్తి ఉందని, అందుకే అలా ట్వీట్ చేశారని తెలిసింది. ఈయన కూడా బి‌జే‌పిని వీడిపోవచ్చని అంటున్నారు. చూడాలి మరి జితేందర్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version