సోయం సైడ్ అవుతారా? కాంగ్రెస్‌లో సీటు?

-

=ఇటీవల తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు తీవ్ర స్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. నేతల మధ్య రచ్చ నడుస్తుంది. ఇప్పటికే బండి సంజయ్, ఈటల రాజేందర్‌లకు ఏ మాత్రం పడటం లేదు. అటు కొందరు నేతల మధ్య పోరు నడుస్తుంది. ఈ పోరు నేపథ్యంలోనే అధ్యక్షుడుగా బండి సంజయ్‌ని మార్చే ప్రక్రియ జరగనుందని తెలుస్తుంది. ఇప్పటికే మార్పులపై ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి.

ఇదిలా ఉండగానే కొందరు నేతలు పార్టీని వీడే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలు పార్టీని వీడటానికి రెడీ అయ్యారు. ఇదే క్రమంలో ఆదిలాబాద్ బి‌జే‌పి ఎంపీ సోయం బాపూరావు  సైతం పార్టీని వీడతారని కథనాలు వస్తున్నాయి. ఇటీవల ఆయన ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. తన ఎంపీ నిధులని ఇంటి నిర్మాణానికి, తన కుమారుడు పెళ్ళికి వినియోగించానని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పై విమర్శలు వచ్చాయి. అలా ఎంపీ నిధులని సొంతానికి వాడుకోకూడదని పలువురు ఫైర్ అయ్యారు. అయితే దీనిపై వెంటనే సోయం బాపూరావు మాట మార్చేశారు.

తాను అలా అనలేదని, తన మాటలని వక్రీకరించి..తమ పార్టీలోని రమేశ్ రాథోడ్, పాయల్ శంకర్ తనపై కుట్ర చేశారని బాపూరావు ఆరోపించారు. అంటే ఈయనకు సొంత పార్టీ నేతలతోనే పడటం లేదని తెలుస్తుంది. ఇటు బి‌జే‌పిలో అనుకున్న విధంగా ప్రాధాన్యత దక్కడం లేదని ఆయన అనుచరులు అసంతృప్తిగా ఉన్నారట.

పైగా రాష్ట్రంలో బి‌జే‌పి వెనుకబడుతుంది..అటు కాంగ్రెస్ రేసులోకి వస్తుంది. ఈ క్రమంలో సోయం బాపూరావు  సైతం బి‌జే‌పిని వీడటానికి సిద్ధమవుతారని అంటున్నారు. గత ఎన్నికల్లో ఈయన బోథ్ నుంచి కాంగ్రెస్ లో పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. తర్వాత బి‌జే‌పిలోకి వచ్చి ఆదిలాబాద్ ఎంపీగా గెలిచారు. నెక్స్ట్ బి‌జే‌పి నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు తక్కువే..అందుకే ఈయన మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ప్రచారం వస్తుంది. బోథ్ లో పోటీ చేస్తారని అంటున్నారు. చూడాలి మరి సోయం బాపూరావు కూడా జంప్ అవుతారేమో.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version