మొత్తానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో ఖమ్మం జిల్లా రాజకీయాలు మారిపోయాయి. ఆయన రాకతో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరిందని చెప్పవచ్చు. మామూలుగానే ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి బలం ఎక్కువే. గత ఎన్నికల్లోనే కాంగ్రెస్ మంచి విజయాన్ని అందుకుంది. ఉమ్మడి జిల్లాలో 10 సీట్లు ఉంటే..కాంగ్రెస్ 6, టిడిపి 2, బిఆర్‌ఎస్ ఒకటి, ఇండిపెండెంట్ ఒకరు గెలిచారు.
అయితే తర్వాత ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని మినహా మిగిలిన వారందరినీ బిఆర్‌ఎస్ లోకి లాగేసుకుంది. దీంతో ఖమ్మంలో బిఆర్‌ఎస్ పట్టు సాధించింది. కానీ క్షేత్ర స్థాయిలో ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి బలం యూఎన్‌ఐ. ఈ క్రమంలో పొంగులేటి అండ్ టీం కాంగ్రెస్ లోకి రావడం పెద్ద ప్లస్ గా మారింది. ఇంకా నెక్స్ట్ ఎన్నికల్లో పొంగులేటి వర్గానికి నాలుగు సీట్లు వరకు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇదే క్రమంలో పొంగులేటి పోటీపై చర్చ నడుస్తుంది.
ఖమ్మంలో జనరల్ సీట్లు మూడు ఉన్నాయి..పాలేరు, కొత్తగూడెం, ఖమ్మం సీట్లు ఉన్నాయి. అయితే పాలేరులో షర్మిల పోటీ చేయనున్నారు. దీంతో అక్కడ పొంగులేటి పోటీ చేసే ఛాన్స్ లేదు. కొత్తగూడెం, ఖమ్మం సీట్లు ఉంటాయి. అయితే జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ తోనే పొంగులేటికి పంచాయితీ. దీంతో పొంగులేటి ఖమ్మం అసెంబ్లీ బరిలో దిగుతారని తెలుస్తుంది.
ఒకప్పుడు ఇది కమ్యూనిస్టుల కంచుకోట..మధ్య మధ్యలో కాంగ్రెస్, టిడిపి గెలిచాయి. ఇక తెలంగాణ వచ్చాక 2014లో కాంగ్రెస్ నుంచి పువ్వాడ అజయ్ గెలిచారు. తర్వాత ఈయన బిఆర్‌ఎస్ లోకి వెళ్లారు.ఇక 2018లో బిఆర్‌ఎస్ నుంచి ఖమ్మంలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఈయనే. అలాగే మంత్రి వర్గంలో ఛాన్స్ కొట్టేశారు. అయితే ఈయనని ఓడించడానికి కాంగ్రెస్ చూస్తుంది. ఇప్పుడు పొంగులేటి..పువ్వాడపై పోటీ చేస్తే టఫ్ ఫైట్ నడవడం ఖాయం.
అయితే ఖమ్మంలో కమ్యూనిస్టులు, టిడిపికి బలం ఉంది. కమ్యూనిస్టులు..బిఆర్‌ఎస్ తో కలిస్తే..ఆ పార్టీకే లాభం. ఇక టిడిపి పోటీ చేస్తే ఓట్లు చీలి..బిఆర్‌ఎస్ పార్టీకే నష్టం. మొత్తానికి ఈ సారి ఖమ్మంలో హోరాహోరీ పోరు జరగనుంది.