గత కొన్ని రోజులుగా కమ్మ సామాజికవర్గ నేతలను టార్గెట్ చేసిన బిజెపి రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి ఇప్పుడు కొంతమంది కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యేలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఇద్దరు కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకోవడానికి ఆయన కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నారు.
వైసీపీలో ఉన్న కొంత మంది తో కూడా ఆయన చర్చలు జరుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు కమ్మ సామాజిక వర్గంలో ఉన్న కొంతమంది నియోజకవర్గాల ఇన్చార్జిలు మీద ఆయన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది కమ్మ సామాజికవర్గ నేతలను కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఆయన టార్గెట్ చేశారు. వాళ్లని పార్టీలోకి తీసుకురావడానికి ఆఫర్లు కూడా ఇస్తున్నారని సమాచారం.
అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో అవకాశాలు తక్కువగా ఉన్న నేపధ్యంలో వాళ్ళు పార్టీ మారడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అయినా సరే సుజనాచౌదరి వాళ్ల విషయంలో పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. పార్టీలోకి వస్తే అధికార వైసీపీ నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాను చూసుకుంటానని హామీ కూడా ఆయన ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే కొంతమంది నేతలు ఆసక్తికరంగా ఉన్నాసరే బీజేపీలోకి వెళితే గెలుస్తామా లేదో అనే భయం లోనే ఎక్కువగా ఉన్నారు. అందుకే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు.