ఆ విష‌యంలో రేవంత్ వెన‌క‌డుగు వేయ‌డానికి కార‌ణం అదేనా..

-

రేవంత్ అంటేనే దూకుడుకు మారుపేరుగా ఆయ‌న మొద‌టి నుంచి అలాగే రాజ‌కీయాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయ‌న మ‌రీ ఎక్కువ‌గా రెచ్చిపోయి మ‌రీ ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఇక మొన్న మంత్రి మ‌ల్లారెడ్డి మీద కేసీఆర్ ద‌త్త‌త గ్రామంలో దీక్ష సంద‌ర్భంగా తిట్ల పురాణం ఎత్తుకుని, సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇందుకు ధీటుగానే మ‌ల్లారెడ్డి కూడా రెచ్చిపోయారు. అవ‌స‌ర‌మైతే తాను రాజీనామా చేస్తాన‌ని త‌న‌పై పోటీ చేయాలంటూ స‌వాల్ విస‌ర‌డం ఇప్పుడు పెద్ద సంచల‌నం రేపుతోంది.

కాగా ఒక్క మ‌ల్లారెడ్డియే కాదంట చాలామంది టీఆర్ ఎస్ నేత‌లు ఇదే విధంగా రేవంత్‌పై స‌వాల్ విసిరేందుకు రెడీ అవుతున్నారు. అయ‌తే వీరంద‌రూ ఇలా ఎందుకు సవాల్ విస‌రుతున్నారు. ఎందుకింత ధైర్యం అనేది ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నిజానికి రేవంత్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఒక నియోజ‌క వ‌ర్గంలో లేరు. ఆయ‌న ఇప్పుడు ఎంపీ గా ఉన్నారు. ఇక మంత్రి మ‌ల్లారెడ్డి అయితే మొన్న త‌న మంత్రి ప‌ద‌వితో పాటు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చే్తాన‌న్నారు.

ఇక రేవంత్ కూడా త‌న టీపీసీసీ ప్రెసిడెంట్ ప‌ద‌వికి అలాగే త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసి త‌న‌పై పోటీ చేసి గెల‌వాలంటూ స‌వాల్ విసురుతున్నారు. అయితే రేవంత్ మాత్రం ఈ స‌వాల్‌పై పెద్ద‌గా స్పందించ‌ట్లేదు. ఎందుకంటే రేవంత్ ఇప్పుడు ఒక‌వేళ త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసినా కూడా త‌న టీపీసీసీ ప్రెసిడెంట్ ప‌ద‌వికి మాత్రం రాజీనామా చేసేందుకు రెడీగా లేర‌ని తెలుస్తోంది. పార్టీ పదవిని వదలుకోవటం రేవంత్‌కు అస్స‌లు ఇష్టం లేద‌ని ఎప్ప‌టి నుంచో చ‌ర్చ‌సాగుతోంది. ఎంతో క‌ష్ట‌ప‌డి తెచ్చుకున్న ప‌ద‌వి కావ‌డంతో ఆయ‌న ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నారంట‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version