చంద్రబాబు సన్నిహితుల మీద ఐటి దాడులు… గత నాలుగు రోజులుగా మీడియాలో ఎక్కువగా వస్తున్న వార్తలు ఇవే. రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఈ పరిణామం ఇబ్బందిగా మారితే ఆ పార్టీ అధినేత చంద్రబాబులో మాత్రం ఆందోళనకు కారణంగా మారినట్టు తెలుస్తుంది. అధికారం కోల్పోయిన తర్వాత తనకు వచ్చే ఇబ్బందులు ఏమీ లేవని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం భయపడే పరిస్థితి ఏర్పడింది.
రాజకీయంగా చంద్రబాబు ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇప్పుడు ఒక్కొక్కటి ఆయన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. తనకు పిఏ గా పని చేసిన శ్రీనివాస్ సహా తన కుమారుడు లోకేష్ సన్నిహితుల మీద ఐటి దాడులు జరుగుతున్నాయి. పార్టీ కీలక నేతగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు సహా మరికొందరు నేతల మీద కూడా ఐటి దాడులు జరుగుతున్నాయి. విద్యుత్ శాఖలో పనులు చేసిన కాంట్రాక్టర్ల మీద కూడా జరుగుతున్నాయి.
హైదరాబాద్ లో ఉండే తన సన్నిహితుల మీద ఐటి దాడులు జరుగుతున్నాయి. దీనికి తోడు ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు ని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తన మాజీ పిఏ శ్రీనివాస్ ఇళ్ళ మీద ఐటి దాడులు జరుగుతున్నాయి. అసలు నాలుగు రోజుల నుంచి విరామం లేకుండా అధికారులు సోదాలు చేస్తున్నారు. స్థానిక అధికారులకు కూడా సమాచారం లేకుండా జరుగుతున్నాయి. దీనితో ఇప్పుడు చంద్రబాబులో ఆందోళన మొదలయింది. బాలకృష్ణ చిన్న అల్లుడు మీద కూడా బ్యాంకులు ఒత్తిడి తెస్తున్నాయి.
అసలు తన వెనుక ఎం జరుగుతుంది అనే ఆరా తీస్తున్నారు ఆయన. తనను టార్గెట్ చేసింది ఎవరు అనే దాని మీద చంద్రబాబు పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తున్నారు. ఈ పరిణామం నుంచి ఏ విధంగా బయటపడాలి అనే దాని మీద చంద్రబాబు ఇప్పుడు తీవ్ర మధన పడుతున్నట్టు తెలుస్తుంది. ఇన్నాళ్ళు పరిస్థితులు అన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయని భావించిన బాబు ఇప్పుడు కేంద్రంలో తనకు సన్నిహితంగా ఉండే బిజెపి నేతల ద్వారా ఎం జరుగుతుంది అనే ఆరాలు తీస్తున్నట్టు సమాచారం.