రాజకీయాల్లో కోవర్టులు అనే వారు సహజంగానే ఉంటారు..ఒక పార్టీలో ఉంటూ..మరొక పార్టీకి సాయం చేస్తుంటారు. అలాంటి కోవర్టులు ఏపీ రాజకీయాల్లో ఎక్కువగానే ఉన్నారు. ముఖ్యంగా కొందరు మేధావులు ముసుగులో ఉంటూ కోవర్టులుగా పనిచేస్తుంటారు. గత ఎన్నికల ముందు మేధావుల ముసుగులో ఉంటూ చాలామంది టిడిపికి డ్యామేజ్ చేసి..వైసీపీని గెలిపించడం కోసం పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి.
అంటే ఉండవల్లి అరుణ్ కుమార్, ముద్రగడ పద్మనాభం, రమణ దీక్షితులు..ఇలా చెప్పుకుంటూ పోతే పలువురు పెద్దల ముసుగులో వైసీపీ కోసం పనిచేశారని టిడిపి ఆరోపించింది. ఇక ఇప్పుడు కూడా అదే మాదిరిగా వైసీపీ కోసం పనిచేసేవారు ఉన్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ వెనుక కూడా ఒక కోవర్టు ఉన్నారని, ఆయన టిడిపికి నష్టం, వైసీపీకి లాభం చేసేలా రాజకీయం చేస్తున్నారని టిడిపి శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. కాపుసంక్షేమ సేన పేరుతో రాజకీయం చేస్తున్న హరిరామ జోగయ్య జగన్ కోవర్టు అని ఆరోపిస్తున్నారు.
జోగయ్య..పవన్ కోసం పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఇటీవల మాట్లాడుతున్న మాటలు పవన్‌ని ముంచేలా ఉన్నాయని అంటున్నారు. జనసేనతో టిడిపికి పొత్తు తప్పనిసరి అని, అలాంటప్పుడు పవన్ కు సిఎం సీటు ఇచ్చేసి..చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని జోగయ్య అన్నారు. తాజాగా పొత్తుపై మళ్ళీ మాట మార్చేసి..ఏపీలో టిడిపి, వైసీపీ, జనసేన ఒంటరిగా ఎన్నికల బరిలో దిగితే..జనసేన గెలిచి పవన్ సిఎం అవుతారని జోగయ్య జోస్యం చెప్పారు. ప్రజలు టిడిపి, వైసీపీలని నమ్మడం లేదని అన్నారు.
అయితే జోగయ్య చెప్పేవి జరగడం కష్టం..40 శాతం ఓట్లు ఉన్న టిడిపి..10 శాతం ఓట్లు లేని పవన్‌కు సిఎం సీటు ఇవ్వడం కష్టం..ఆ విషయం పవన్‌కు తెలుసు. ఒంటరిగా పోటీ చేస్తే జనసేనకు 10 సీట్లు వస్తాయా? అనేది డౌట్. కానీ జోగయ్య కావాలని పవన్ ని రెచ్చగొట్టి టిడిపితో పొత్తు లేకుండా చేసి జగన్ కు మేలు చేయాలని చూస్తున్నారని టిడిపి శ్రేణులు ఆరోపోస్తున్నాయి. మరి జోగయ్య చెప్పినట్లు జరుగుతుందో లేదో చూడాలి.