కృష్ణాలో జగన్..మళ్ళీ వైసీపీ ఆధిక్యం?

-

వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారం దక్కించుకోవడమే టార్గెట్ గా జగన్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో జగన్ దూకుడుగా ముందుకెళ్లడం మొదలుపెట్టారు. ప్రజా మద్ధతు ఏ మాత్రం తగ్గకుండా చూసుకోవడమే లక్ష్యంగా వెళుతున్నారు. ఎప్పటికపుడు పథకాల పేరిట డబ్బులు ఇచ్చే కార్యక్రమం పేరుతో..సభలు నిర్వహిస్తూ..జనంలో ఉంటున్నారు. అలాగే అభివృద్ధి జరగడం లేదని నాలుగేళ్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల కాలంలో జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థానపలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ నెల కృష్ణా జిల్లాలో పలు కార్యక్రమాల్లో జగన్ పాల్గొనున్నారు. జిల్లాలో కీలకమైన మచిలీపట్నం(బందరు), గుడివాడ నియోజకవర్గాల్లో జగన్ పర్యటించనున్నారు. ఈ నెల 19న గుడివాడలో టిడ్కో ఇళ్లని లబ్దిదారులకు అందజేయనున్నారు. అలాగే గుడివాడ బస్టాండ్‌కు శంఖుస్థానప చేయనున్నారు. ఇక ఈ నెల 22న బందరు పోర్టు శంఖుస్థానపన చేయనున్నారు. అయితే గుడివాడలో టిడ్కో ఇళ్ళు టి‌డి‌పి హయాంలో నిర్మించినవే..ఇప్పుడు వాటికి రంగులు వేసి ఇస్తున్నారని టి‌డి‌పి నేతలు విమర్శలు చేస్తున్నారు.

అటు బందరు పోర్టుకు గతంలో వైఎస్సార్, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు..ఇప్పుడు జగన్ ఎన్నికల ముందే శంకుస్థానపలు చేయడం తప్ప..దాన్ని పూర్తి చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. సరే ఏదేమైనా గాని జిల్లాలో రాజకీయంగా సత్తా చాటడమే టార్గెట్ గా జగన్ కృష్ణా జిల్లా పర్యటన సాగనుంది.

పైగా గుడివాడ కొడాలి నాని, బందరు పేర్ని నాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో పర్యటిస్తే..ఆ ప్రభావం జిల్లాపై ఉంటుందని భావిస్తున్నారు. జిల్లాలో గుడివాడ, బందరుతో పాటు పెడన, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవన్నీ పక్కపక్కనే ఉంటాయి. గత ఎన్నికల్లో గన్నవరం మినహా అన్నీ స్థానాల్లో వైసీపీ గెలిచింది. ఈ సారి స్వీప్ చేయాలని చూస్తున్నారు. చూడాలి మరి జగన్ ప్రభావం కృష్ణా జిల్లాపై ఏ మేరకు ఉంటుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version