ఎక్కడైనా ఓ రాష్ట్రం అభివృద్ధి బాటపట్టాలన్న…ఆర్ధికంగా బలపడాలన్న…కేంద్రం సపోర్ట్ తప్పనిసరి అని చెప్పొచ్చు. కేంద్రం సపోర్ట్ తోనే రాష్ట్రాలు ఆర్ధికంగా బలపడతాయి. అయితే ఆర్ధిక పరమైన అంశాలే కాదు…రాజకీయంగా కూడా కేంద్రం సపోర్ట్ ఉంటే రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు తిరుగుండదు. అలా కాకుండా కేంద్రానికి ఎదురుతిరిగి పోరాడితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పొచ్చు. దేశంలో బీజేయేతర సీఎంలు..కేంద్ర ప్రభుత్వంపై కాస్త గట్టిగానే పోరాటం చేస్తున్నారు..కానీ కొందరు మాత్రం కేంద్రంతో సఖ్యతతో ఉంటున్నారు.
ఉదాహరణకు ఒడిశాలో సీఎం నవీన్ పట్నాయక్, ఏపీలో సీఎం జగన్…వీరు కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వడం లేదు. దీని వల్ల వారికి రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవడం లేదు…నవీన్ సంగతి ఏమో గాని…జగన్ కు మాత్రం కేంద్ర పరంగా రాజకీయ సాయం బాగానే ఉంటుంది. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు మొదట్లో బీజేపీతో కలిసి పనిచేసి…తర్వాత బయటకొచ్చి కేంద్రంతో యుద్ధం చేశారు. అలా చేయడం వల్ల చివరికి రాజకీయంగా చంద్రబాబు బలి కావాల్సి వచ్చింది.
గత ఎన్నికల్లో చంద్రబాబు దారుణంగా ఓడిపోవడానికి..కేంద్రం పరోక్షంగా జగన్ కు సాయం చేయడం కూడా ఓ కారణమని చెప్పొచ్చు. అందుకే జగన్ గెలిచాక కేంద్రంతో కయ్యం పెట్టుకునే పనులు చేయడం లేదు…రాష్ట్రంలో బీజేపీ విషయంలో ఎలా ఉన్నా సరే..కేంద్రంలో మాత్రం చాలా సఖ్యతతో ఉంటున్నారు…అన్నీ విషయాల్లో కేంద్రానికి మద్ధతు ఇస్తున్నారు…ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల విషయంలో కూడా జగన్ ఫుల్ సపోర్ట్ బీజేపీకే. ఆ విషయం వైసీపీ ఎంపీ శ్రీధర్ సైతం క్లారిటీ ఇచ్చారు.. గత మూడేళ్లుగా బీజేపీకి మద్దతు ఇస్తున్నే ఉన్నామని స్పష్టం చేశారు.
అయితే రాష్ట్రానికి పూర్తి స్థాయిలో కేంద్రం సాయం చేయకపోయినా సరే జగన్ మాత్రం బీజేపీకి సపోర్ట్ గా ఉంటున్నారు…దీనికి కారణం రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే జగన్ ఇలా చేస్తున్నారని చెప్పొచ్చు. పైగా ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీని బీజేపీకి దగ్గర కానివ్వకుండా చేయడంలో జగన్ సక్సెస్ అవుతున్నారు. అలాగే బీజేపీకి పవన్ ని సైతం దూరం చేసే కార్యక్రమం జరుగుతున్నట్లు కనిపిస్తోంది…అలా చేస్తే వచ్చే ఎన్నికల్లో కేంద్రం ఫుల్ సపోర్ట్ జగన్ కే ఉంటుంది…అప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మళ్ళీ గెలిచేయొచ్చని చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి కేంద్రం సపోర్ట్ ఉంటే జగన్ కు మళ్ళీ తిరుగులేని విజయం దక్కుతుందో లేదో.