జనసేనకు సీట్లు తక్కువే..పవన్‌కు మళ్ళీ ఓటమే.!

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో సి‌ఎం జగన్‌ని టార్గెట్ చేసి ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే. విశాఖ పర్యటనలో ఉన్న ఆయన జగన్ దోచుకోవడానికే సి‌ఎం అయ్యారు అంటూ విరుచుకుపడుతున్నారు. అటు వైసీపీ నేతలని సైతం పవన్ టార్గెట్ చేసి ఫైర్ అవుతున్నారు. అయితే వైసీపీ నేతల నుంచి కూడా అదే స్థాయిలో పవన్‌కు కౌంటర్లు పడుతున్నాయి. జగన్‌ని పవన్ తక్కువ అంచనా వేస్తున్నారని, ఎంతమంది కట్టకట్టుకుని వచ్చిన మళ్ళీ జగనే సి‌ఎం అవుతారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అంటున్నారు.

జన్మలో పవన్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేరని, బాబుకు పవన్ ఊడిగం చేస్తున్నారని, బాబు దద్దమ్మ అయితే..లోకేష్ పప్పుగాడు అని రోజా ఫైర్ అవుతున్నారు. ఇక పవన్‌ని బాబు వాడుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో పవన్‌కు సి‌ఎం అవ్వాలని లేదని, పవన్ 25 సీట్లు మాత్రమే అడుగుతున్నారని, అవి కూడా ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధంగా లేరని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. ఇలా వైసీపీ నుంచి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.

అయితే టి‌డి‌పి-జనసేన పొత్తు ఫిక్స్ అవ్వడంపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ దాదాపు పొత్తు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఎవరుకెన్ని సీట్లు అనేది క్లారిటీ లేదు. అలాగే సి‌ఎం కావాలని తనకు ఉందని, కానీ అది అంత ఈజీగా దక్కదని, కాలమే నిర్ణయిస్తుందని పవన్ అంటున్నారు. అంటే సి‌ఎం సీటు విషయంలో కాస్త క్లారిటీ కనిపిస్తోంది. పొత్తులో చంద్రబాబు సి‌ఎం అని తెలుస్తోంది.

ఇక పవన్ పోటీ చేసి గెలవడంపై కామెంట్లు వస్తున్నాయి. పొత్తులో పోటీ చేసినా, చేయకపోయినా ఈ సారి పవన్ గెలవడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version