సిక్కోలులో జనసేనకు నో ఛాన్స్..టీడీపీ త్యాగం చేస్తుందా?

-

టిడిపి, జనసేన పొత్తు నేపథ్యంలో ఎవరు ఎక్కడ పోటీ చేస్తారు? ఏ స్థానాల్లో పోటీ చేస్తే విజయం సాధించవచ్చు అని విశ్లేషణ చేస్తున్నారు. టిడిపి తో కలిసి పనిచేయాల్సిందే అని జనసేన కార్యకర్తలకు పవన్ తెలిపారు. ఒక రకంగా చేయక తప్పదు అని వారిని హెచ్చరించారని చెప్పవచ్చు.

జిల్లాల వారీగా జనసేన ప్రభావాన్ని తెలుసుకుంటే ముందుగా శ్రీకాకుళం జిల్లా.. శ్రీకాకుళం అసెంబ్లీలో జనసేన పార్టీ తరఫున గతంలో కోరాడ సర్వేశ్వరరావు పోటీ చేశాడు. పోటీ చేయడం వల్ల ధర్మానకు లాభించిందని చెప్పవచ్చు. టిడిపి ఓట్లు చీలి ధర్మాన గెలిచారు. ఇక్కడ టిడిపి తో పొత్తు ఉంటే తప్ప జనసేన ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించలేదు.

నరసన్నపేట మెట్ట వైకుంఠవరావు జనసేన అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ కూడా జనసేన నామమాత్రమని చెప్పవచ్చు. టెక్కలి కళాతి కిరణ్ ఉన్నారు, కానీ స్వయంగా జనసేన పోటీ చేస్తే గెలిచే శక్తి లేదు. పలాస నుండి తోట పూర్ణచందర్రావు గతంలో గెలిచే గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. వేగిలాడ దుర్గారావు ఇప్పుడు ఇన్చార్జిగా ఉన్నారు. దుర్గారావు స్థానిక సమస్యలు అయినా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య, జీడిపిక్కల మద్దతు ధర మొదలైన వాటి నుండి వాటి గురించి నిరసన చేస్తూ ఉంటారు. కానీ ఇతను స్థానికంగా ఉండరని హైదరాబాదులోనే ఉంటాడని వార్తలు వినిపిస్తున్నాయి. జనసేన శ్రీకాకుళం జిల్లా నుంచి ఆశించినా, టిడిపి ఇచ్చినా ఈ పలాస ఒక్కటే అని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అక్కడ టి‌డి‌పి నుంచి గౌతు శిరీష ఉన్నారు..ఇక్కడ టి‌డి‌పికి కాకుండా జనసేనకు సీటు ఇస్తే..వైసీపీకి ప్లస్ అవుతుంది.

ఇచ్చాపురం దాసరి రాజు జనసేన అభ్యర్థిగా ఉన్నారు.   ఇతను సేవా కార్యక్రమాల్లో ముందుంటారు కానీ పార్టీకి అనుకూలంగా నిరసనలు గాని, రాజకీయ కార్యకలాపాలకు గాని దూరంగా ఉంటాడు. రోళ్ళ రాజేష్ అంగబలం, అర్ధబలం ఉన్న అభ్యర్థి.

కానీ ఇచ్చాపురం అనేది టి‌డి‌పి కంచుకోట..పైగా సిట్టింగ్ సీటు..కాబట్టి ఇది వదులుకునే ఛాన్స్ లేదు. అటు ఎచ్చెర్ల లో కాంతిశ్రీ ఉన్నారు ముస్లిం మైనారిటీ ఓటర్లు ఉన్న ఎచ్చెర్ల లో క్రాంతి శ్రీ గెలుపు కష్టమే. ఆముదాలవలస, పాతపట్నం మొదలైన వాటిలో కూడా జనసేన ప్రభావం తక్కువనే చెప్పవచ్చు. అలాంటప్పుడు శ్రీకాకుళంలో జనసేనకు పట్టున సీట్లు లేవు..దీంతో అక్కడ జనసేనకు ఏ సీటు ఇస్తారనేది పెద్ద ప్రశ్న.

Read more RELATED
Recommended to you

Exit mobile version