మళ్లీ యాక్టివ్ అవుతున్న కవిత.. వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చెయ్యబోతున్నారా..?

-

తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై కవితకు మంచి గుర్తింపుంది.. లిక్కర్ కేసు ఆరోపణలతో జైలుకు వెళ్లి వచ్చిన కవిత.. బయటికి వచ్చిన తర్వాత చాలా రోజులపాటు బయటికి రాలేదు.. రాజకీయాలను అస్సలు పట్టించుకోలేదు.. కొన్నాళ్లు తండ్రితో కలిసి ఫామ్ హౌస్ లో ఉన్న ఆమె.. మళ్లీ తిరిగి రాజకియాల్లో యాక్టివ్ అయ్యారు.. ప్రభుత్వంపై పంచ్ డైలాగులు పేలుస్తున్నారు.. ఇదే సమయంలో అసెంబ్లీ నియోకవర్గాన్ని చూసుకుని అక్కడి నుంచే రాజకీయాలు చెయ్యాలని ఆమె భావిస్తున్నారట..

అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే కవిత ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ వచ్చారు.. కేటీఆర్ పై కేసు నమోదు చేసిన సమయంలో కూడా.. అన్నకు మద్దతుగా సీఎం రేవంత్ పై దుమ్మెత్తిపోశారు.. అయితే ఆమె ఒక వ్యూహంతో రాజకీయ విమర్శలు చేస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది.. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆమె ఇటీవల చేసిన పర్యటన శ్రేణుల్లో నూతనోత్సహాన్ని నింపింది..

కవిత జగిత్యాల నుంచి రీఎంట్రీ ఇవ్వడంతో పొలిటికల్ సర్కిళ్లలో ఆసక్తికర టాక్ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జగిత్యాల నుంచే కవిత పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. అందుకోసం ఇప్పటి నుంచే ఆమెగ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. గత ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో విసృతంగా ఆమె ప్రచారం చేశారు.. జగిత్యాలలో బీఆర్ఎస్ జెండా ఎగరడానికి ఆమె ప్రచారం కూడా కారణమైంది..

జగిత్యాల నుంచి గెలిచిన సంజయ్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి.. హస్తం గూటికి చేరిపోవడంతో.. ఆమె ఈ స్థానం నుంచే వచ్చె ఎన్నికల్లో పోటీ చెయ్యాలని భావిస్తున్నారట.. జగిత్యాలలో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగరవేసేందుకు సిద్దంగా ఉన్నాననే సంకేతాలను ఆమె క్యాడర్ కు ఇస్తున్నారు.. గత ఎన్నికల సమయంలో ఆమె నిజామాబాద్ ఎంపీగా ఉండటంతో.. పార్టీ ఎమ్మెల్యేల గెలుపు కోసం ఆమె ప్రచారం చేశారు. జగిత్యాలలో పట్టు సాధిస్తే.. ఆ ప్రభావం జిల్లా మొత్తమీదా ఉంటుందని కవిత భావిస్తున్నారట.. జగిత్యాలతో పాటు అన్ని నియోజకవర్గాల్లో పర్యటించాలని.. ఇదే సమయంలో తెలంగాణ జాగృతిని యాక్టివ్ చెయ్యాలని కవిత భావిస్తున్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది.. అయితే ఆమె జగిత్యాల నుంచి పోటీ చేస్తారా..? లేక పార్టీని బలోపేతం చేసుకునేందుకు పర్యటనలు చెయ్యాలనుకుంటున్నారో చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version