ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి, ఎల్లారెడ్డి..రెండు పక్క పక్కనే ఉండే నియోజకవర్గాలు. రెండు సీట్లు బిఆర్‌ఎస్ పార్టీ కంచుకోటలే. గత వరుస ఎన్నికల్లో ఈ సీట్లలో బిఆర్‌ఎస్ హవా నడుస్తోంది. కాకపోతే గత ఎన్నికల్లోనే ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ నుంచి జాజల సురేందర్ గెలిచారు. తర్వాత ఎలాగో ఆయన బిఆర్‌ఎస్ లోకి జంప్ చేశారు. దీంతో కామారెడ్డి, ఎల్లారెడ్డి బిఆర్‌ఎస్ అండర్ లోనే ఉన్నాయి.
అయితే ఇప్పుడు ఈ రెండు సీట్లలో సత్తా చాటాలని కాంగ్రెస్ చూస్తుంది. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు చెక్ పెట్టాలని చుస్తుంది. కామారెడ్డిలో సీనియర్ నేత షబ్బీర్ అలీ..గెలుపు కోసం కష్టపడుతున్నారు. ఎప్పుడో 2004లో ఇక్కడ చివరిగా గెలిచారు. మళ్ళీ ఇంతవరకు గెలవలేదు. మరొకసారి ఇక్కడే ఆయనే పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఇటు బిఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. 1994, 2009 ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచిన ఈయన, 2012 ఉపఎన్నిక, 2014, 2018 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ నుంచి గెలిచారు. ఇప్పుడు ఆయనపై వ్యతిరేకత వచ్చిందని, ఆయనకు సీటు ఇవ్వవద్దని సొంత పార్టీ నేతలే మాట్లాడుతున్నారు.
ఈ క్రమంలో గంప కొత్త స్కెచ్ వేశారు..కామారెడ్డిలో కేసిఆర్ పోటీ చేస్తారని, ఆయన్ని పోటీ చేయాలని తాను కోరినట్లు చెప్పారు. కానీ కేసిఆర్..మళ్ళీ గజ్వేల్ నుంచే పోటీ చేస్తారని హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. దీంతో గంప..యాంటీ వర్గానికి చెక్ పెట్టడానికి ఇలా చెప్పినట్లు తెలిసింది. ఆయనే మళ్ళీ పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. కానీ కేసిఆర్ సీటు ఖాయం చేస్తారా? లేదా? అనేది క్లారితే లేదు.
అటు ఎల్లారెడ్డి విషయానికొస్తే బిఆర్‌ఎస్ నుంచి ఎమ్మెలే సురేందర్ పోటీ చేసే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ నుంచి మదన్ మోహన్ రావు సీటు ఆశిస్తున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి గతంలో బిఆర్‌ఎస్ నుంచి 3 సార్లు గెలిచారు. 2018లో ఓడిపోయారు. తర్వాత ఈటల రాజేందర్ తో కలిసి బిజేపిలోకి వెళ్లారు. ఈయన బిజేపి నుంచి బరిలో ఉండే ఛాన్స్ ఉంది. కానీ ఈయన కూడా కాంగ్రెస్ లోకి రావాలని చూస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి కామారెడ్డి,ఎల్లారెడ్డి సీట్లలో అభ్యర్ధులు పూర్తిగా తేలడం లేదు.