తెలంగాణ సిఎం కేసిఆర్..సంచలన నిర్ణయం తీసుకున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను రెండు చోట్ల పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఊహించని విధంగా గజ్వేల్ తో పాటు..కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే ఇలా రెండు చోట్ల కేసిఆర్ ఎందుకు బరిలో దిగుతున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. కేసిఆర్ ఎక్కడ పోటీ చేసిన గెలుస్తారు..కాబట్టి గజ్వేల్ ఒకటి సరిపోతుంది. కానీ ఆయన రెండు చోట్ల ఎందుకు బరిలో దిగాలని అనుకున్నారో సరైన క్లారిటీ లేదు.
అయితే బిఆర్‌ఎస్ వర్గాల సమాచారం ప్రకారం..గజ్వేల్ లో పోటీ చేస్తే ఉమ్మడి మెదక్ లో పార్టీకి ప్లస్ అవుతుంది..అది తెలిసిందే. అదే సమయంలో కామారెడ్డిలో పోటీ చేయడం వల్ల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా బిఆర్‌ఎస్ పార్టీకి మైలేజ్ వస్తుందని, అక్కడ బిఆర్‌ఎస్ సత్తా చాటుతుందని, అందుకే కేసిఆర్ పోటీ చేస్తున్నారని చెబుతున్నారు. అయితే గజ్వేల్ లో సర్వేలు కేసిఆర్‌కు అనుకూలంగా లేవని, అక్కడ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని, అందుకే ఆయన కామారెడ్డి రెండో ఆప్షన్ గా పెట్టుకున్నారని కాంగ్రెస్ శ్రేణులు కామెంట్ చేస్తున్నాయి.
అయితే కేసిఆర్ గజ్వేల్ లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు..సిఎంగా ఉండటం వల్ల గజ్వేల్‌కు అడ్వాంటేజ్ ఉంటుంది. అలాంటప్పుడు అక్కడ నెగిటివ్ ఉండే అవకాశాలు ఉండవు. రాజకీయంగా నిజామాబాద్ లో కూడా సత్తా చాటాడానికే కేసిఆర్ కామారెడ్డిని కూడా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
2014లో కేసిఆర్ గజ్వేల్ తో పాటు..మెదక్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అధికారంలోకి వచ్చాక ఎంపీ పదవికి రాజీనామా చేశారు. చూడాలి మరి కేసిఆర్ రెండు చోట్ల గెలిచి సత్తా చాటుతారో లేదో.