కేసీఆర్‌కు అసదుద్దీన్‌ షాక్..ఆ స్థానాల్లో కారుకు దెబ్బ.!

-

తెలంగాణ రాజకీయాల్లో చాలా పార్టీలు రేసులో ఉన్నాయి..ఎక్కడక్కడ తమ పట్టు నిరూపించుకోవాలని చూస్తున్నాయి. అసలు తెలంగాణలో ఉన్న పార్టీలు లెక్క చూస్తే..బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్, బి‌జే‌పి, సి‌పి‌ఐ, సి‌పి‌ఎం, బి‌ఎస్‌పి, ఎం‌ఐ‌ఎం, టి‌డి‌పి, వైఎస్సార్టీపీ, టి‌జే‌ఎస్…అబ్బో ఇలా ఒకటి ఏంటి చాలా పార్టీలు ఉన్నాయి. ఎన్ని పార్టీలు ఉన్న ప్రధాన పోరు బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్, బి‌జే‌పిల మధ్య జరుగుతుంది. అయితే ఆ పార్టీల మధ్యే ఓట్లు చీలిపోతాయి అనుకుంటే..మిగిలిన పార్టీల వల్ల కూడా కొన్ని స్థానాల్లో ఓట్ల చీలిక ప్రభావం ఉంటుంది.

ఇదే క్రమంలో కేవలం పాతబస్తీకే పరిమితమైన ఎం‌ఐ‌ఎం ఇపుడు రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ పెడుతుంది. త్వరలోనే తెలంగాణలో పార్టీ అభ్యర్ధులని ప్రకటిస్తామని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బూత్ కమిటీలు ఏర్పాటు చేస్తామని అంటున్నారు. అంటే రాష్ట్ర స్థాయిలో ఎం‌ఐ‌ఎం పార్టీ రేసులోకి వస్తుందని చెప్పవచ్చు. ఇప్పటివరకు పాతబస్తీలోని 7 స్థానాల్లోనే ఎం‌ఐ‌ఎం పోటీ చేసేది..వాటిని గెలుచుకునేది. ఇక ఆ సీట్లలో బి‌ఆర్‌ఎస్ నామమాత్రంగా పోటీ చేసేది.

ఇక మిగిలిన స్థానాల్లో బి‌ఆర్‌ఎస్‌కు ఎం‌ఐ‌ఎం మద్ధతు ఇచ్చేది. దీంతో ఆయా స్థానాల్లో ఉన్న ముస్లిం ఓట్లు బి‌ఆర్‌ఎస్‌కు కలిసొచ్చేవి. ఇప్పుడు అసదుద్దీన్ రాష్ట్ర స్థాయిలో పోటీ చేస్తానని అంటున్నారు. దాని వల్ల ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్న స్థానాల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీకి నష్టం జరిగే ఛాన్స్ ఉంది. ఓట్లు చీలిపోయి బి‌ఆర్‌ఎస్ కు డ్యామేజ్ జరుగుతుంది.

కానీ బి‌ఆర్‌ఎస్,  ఎం‌ఐ‌ఎం మిత్రపక్షాలుగా ఉన్నాయి..అలాంటప్పుడు ఓట్లు చీలిపోయే పరిస్తితి వస్తుందంటే నమ్మడం కష్టమే. కాకపోతే బి‌జే‌పికి పరోక్షంగా లబ్ది చేయాలని ఎం‌ఐ‌ఎం భావిస్తే..బరిలో దిగే ఛాన్స్ ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తూ..ఎం‌ఐ‌ఎం అదేవిధంగా పోటీ చేసి ఓట్లు చీల్చి బి‌జే‌పికి లబ్ది చేకూరుస్తుందనే విమర్శలు ఉన్నాయి. మరి తెలంగాణలో ఎం‌ఐ‌ఎం ప్లాన్ ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version