రంగంలోకి దిగిన కేసీఆర్‌.. క‌రీంన‌గ‌ర్ ప‌ర్య‌ట‌న వెన‌క కార‌ణ‌మిదేనా?

-

ఈట‌ల రాజేంద‌ర్ వ్య‌వ‌హారం ఇప్పుడు తెలంగాణ‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇన్ని రోజులు ఎన్నో అనుమానాలు ఉండేవి. కానీ ఆయ‌న నిన్న త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి, పార్టీ ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించ‌డంతో రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి. దీంతో గులాబీ బాస్ కేసీఆర్ (KCR) అల‌ర్ట్ అయ్యారు. ప్ర‌జ‌ల్లో ఈట‌ల‌కు సానుభూతి పెర‌గ‌కుండా చూసేందుకుప్లాన్ వేశారు.

ఈ క్ర‌మంలో హుజూరాబాద్ రాజ‌కీయాల‌పై ఫోకస్‌పెట్టారు గులాబీ బాస్‌. సెకండ్ గ్రేడ్ నాయ‌కులెవ‌రూ చేజారిపోకుండా చూసేందుకు కరీంనగర్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో కేసీఆర్ కరీంనగర్ సివిల్ ఆస్పత్రిని సందర్శించి రోగుల‌కు అందుతున్న సేవ‌ల‌ను తెలుసుకుంటారు.

అన‌తంరం వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు క‌రీంన‌గ‌ర్‌తో ఈట‌ల‌ రాజేందర్ కు ఎవ‌రూ మ‌ద్ద‌తు తెల‌ప‌కుండా ఉండేందుకు స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల‌కు దిశానిర్దేశం చేయ‌నున్నారు. అలాగే హుజూరాబాద్ నియోజకవర్గంపై పార్టీ పట్టు సడలకుండా ఉండేందుకు వినోద్‌, గంగుల‌కు వ్యూహ‌ర‌చ‌న‌లు అంద‌జేసే అవ‌కాశం ఉంది. మ‌రి క‌రీంన‌గ‌ర్‌పై ఎలాంటి స్పంద‌న ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version