తెలంగాణలో కొంత మంది టిఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అలెర్ట్ అవుతున్నారు. కొంతమంది నేతలు అవినీతి వ్యవహారాల విషయంలో చూసీచూడనట్టుగా వ్యవహరించిన ఆయన ఇప్పుడు మాత్రం కొంతమంది విషయంలో కఠినంగానే ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.
ప్రధానంగా ఖమ్మం జిల్లాలో కొంతమంది నేతలు టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళడానికి తీవ్ర స్థాయిలో కష్టపడుతున్న నేపథ్యంలో వారిని కట్టడి చేయడానికి సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారని సమాచారం. అందుకే కొంత మంది నేతలతో సీఎం కేసీఆర్ నేరుగా చర్చలు జరుపుతున్నారని కొంతమందిని ఇప్పుడు కట్టడి చేయడానికి వాళ్ళ అవినీతి వ్యవహారాల మీద కేసులు నమోదు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతోందని అంటున్నారు.
ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ కోసం పని చేయకుండా భారతీయ జనతా పార్టీకి పరోక్షంగా సహకరించడం అలాగే కోదండరాం లాంటి వాళ్ల కోసం కష్టపడి పనిచేయడం వంటివి ఎక్కువగా జరిగాయి. దీనిలో ఇప్పుడు సీఎం కేసీఆర్ వాళ్ళ మీద సీరియస్ గా ఉన్నారని తెలుస్తుంది. త్వరలోనే వాళ్ళను పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయాలని చూసినా కొంతమంది పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయడం మాత్రం ఉపేక్షించేది లేదని వాళ్ళ అవినీతి వ్యవహారాలు బయటకు సీఎం కేసీఆ పట్టుదలగా ఉన్నారు.