కేసీఆర్ ప్రజలనే కాదు.. వేములవాడ రాజన్నను కూడా మోసం చేశారు : సీఎం రేవంత్ రెడ్డి

-

ప్రజలనే కాదు.. వేములవాడ రాజన్నను కూడా మోసం చేశారు కేసీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. వేములవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. కేసీఆర్ ను గద్దె దించాలని సిరిసిల్ల పాదయాత్రలో నిర్ణయించుకున్నానని తెలిపారు. మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. ఈ ప్రాంతంలో వాయిదాపడుతూ వస్తున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ఈనెల 30న మరోసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడికీ వచ్చి ప్రాజెక్టులపై సమీక్షిస్తారని సీఎం చెప్పారు.

CM Revanth Reddy

దేశానికి ప్రధానిని అందించిన గడ్డ కరీంనగర్ పరిపాలన ఎలా ఉంటుందో దేశానికి చూపిన తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు తెలంగాణ ఇస్తామని సోనియాగాంధీ ఇక్కడి నుంచే ప్రకటన చేసారు. తెలంగాణ బిల్లును ఆమోదింపజేయడంలో కరీంనగర్ బిడ్డ, జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఎంత దూరమైనా వెళ్తుంది. పొన్నం ప్రభాకర్ ను ఎంపీగా గెలిపిస్తే.. తెలంగాణ రాష్ట్రం సాధించారని తెలిపారు. బండి సంజయ్ ను రెండు సార్లు పార్లమెంట్ కు పంపిస్తే కేంద్ర మంత్రి అయ్యారు. కానీ కరీంనగర్ అభివృద్ధి కోసం ఎప్పుడైనా పార్లమెంట్ మాట్లాడారా..? అంతకుముందు 3సార్లు బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే వాళ్లు కూడా చేసిందేమి లేదు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version