ప్రెస్ మీట్ తో తెలంగాణ ప్రజల భవిష్యత్తు తేల్చేసిన కే‌సి‌ఆర్ – వరాల జల్లు

-

 

తెలంగాణా ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ రాష్ట్ర ప్రజానీకం మీద వరాల జల్లు కురిపించారు. అసంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత తనమీద ఉంది అని చెప్పుకొచ్చారు . ఈ ఏడాది మార్చ్ 31 నుంచీ 57 యేళ్ళు దాటిన అందరికీ వృద్ధాప్య పింఛన్ ఇస్తాము అని ఆయన స్పష్టం చేశారు.

 

ప్రభుత్వ ఉద్యోగులకు వయోపరిమితి కూడా పెంచుతామని సీఎం చెప్పారు. పీఆర్‌సీ పెంపుపై కూడా త్వరలో చర్చలు జరుపుతామని సీఎం పేర్కొన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాలసిన నిధులు రావడం లేదు అనే విషయం ఆయన గుర్తు చేశారు ఆయన.

 

 

దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల నిధులు కేంద్రం నుంచి రావాలి అని అది ఇంకా బాకీ ఉంది అన్నారు. కేవలం జి‌ఎస్‌టి కింద వెయ్యి కోట్లు పైగా రావాల్సి ఉంది అని గుర్తుపెట్టుకోవాలి అన్నారు. ఆరోగ్యానికి సంబంధించి తెలంగాణా లో మార్పులు రావాలి అని చెప్పిన కే‌సి‌ఆర్ త్వ్రలోనే తెలంగాణ లో ఆరోగ్య సూచిక ని తెలిపే కార్యక్రమం చేపడతామ్ అని చెప్పారు. గల్ఫ్ వెళ్ళే వాళ్ళ కోసం చాలా ప్రశ్నలు వేశారు కే‌సి‌ఆర్ , ఇక్కడ ఉపాధి లభిస్తూ ఉంటే గల్ఫ్ ఎందుకు వెళుతున్నారు మీరు అని అడిగారు. అసంబ్లీ సెషన్ కి ముందు గల్ఫ్ పర్యటన చేసి సమస్య ని పరిష్కరిస్తాం అన్నారు.

 

 

అప్పులు కూడా చేసి కొంతమంది గల్ఫ్ వెళుతున్నారు అని ఆయన ఆశ్చర్యపోయారు. నైతిక విలువలతో కూడిన విద్యా లేకపోవడం వల్లనే రకరకాల సంఘటనలు జరుగుతున్నాయి అని వాపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version