షాకింగ్: డెంగ్యూ కారణంగా మహిళా జడ్జి మృతి

-

తెలుగు రాష్ట్రాల్లో విష జ్వరాలు అనేక మంది ఉసురు తీస్తున్నాయి. జోరుగా కొనసాగుతున్న వర్షాలతో విష జ్వరాలు మరింతగా విజృంభిస్తున్నాయి. ఈ విష జ్వరాల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. అంతగా వైద్యసౌకర్యం లేని పల్లెటూళ్ల సంగతి అటుంచితే అన్ని సౌకర్యాలు ఉన్న దగ్గర కూడా మరణాలు ఆగడం లేదు.

తాజాగా ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయమూర్తి ఎం జయమ్మను డెంగ్యూ వ్యాధి బలితీసుకుంది. డెంగ్యూ కారణంగా ఆమె ఆకస్మకంగా మృతి చెందారు. డెంగ్యూ తగ్గుముఖం పట్టకపోవడంతో ఆమెను ఖమ్మం నుంచి హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు.

వైద్యులు తమ వంతు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ న్యాయమూర్తి తుదిశ్వాస విడిచారు. ఇటీవలే చిత్తూరు జిల్లాలో బాల నటుడు గోకుల్ సాయి కూడా విష జ్వరం కారణంగానే కన్నుమూశాడు. వైద్య చికిత్సకు కూడా లొంగకుండా డెంగ్యూ జ్వరాలు జనం ఉసురు తీస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version