కిషన్‌ రెడ్డికి సెగలు..అంబర్‌పేట్‌లో ఏం జరుగుతోంది?  

-

కిషన్ రెడ్డికి సోటా నియోజకవర్గంలోనే రాజకీయంగా ఇబ్బందులు ఎదురుకుంటున్నారా? అంబర్‌పేట్ లో మళ్ళీ బరిలో నిలబడి గెలవాలని చూస్తున్న కిషన్ రెడ్డికి సొంత వాళ్ళే యాంటీగా మారుతున్నారా? అంటే ప్రస్తుతం పరిస్తితులని బట్టి చూస్తుంటే అదే నిజమనిస్తుంది. అంబర్‌పేట్ అంటే కిషన్ రెడ్డి కంచుకోట..అక్కడ తిరుగులేని విజయాలు సాధించారు. కానీ గత ఎన్నికల్లో కే‌సి‌ఆర్ వ్యూహాలతో కిషన్ రెడ్డికి చెక్ పడింది. కాకపోతే స్వల్ప మెజారిటీతోనే కిషన్ రెడ్డి ఓడిపోయారు.

కానీ ఆ వెంటనే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి కిషన్ రెడ్డి సత్తా చాటారు. అలాగే మోదీ కేబినెట్ లో ఛాన్స్ కొట్టేశారు. ఆ మధ్య తెలంగాణ బి‌జే‌పి అధ్యక్ష బాధ్యతలు కూడా దక్కించుకున్నారు. ఇలా కీలక పదవులు దక్కించుకున్న కిషన్ రెడ్డికి సొంత నియోజకవర్గంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఇంతకాలం కిషన్ రెడ్డికి మద్ధతు ఇచ్చిన నేతలు నిదానంగా సైడ్ అవుతున్నట్లు తెలుస్తోంది. పైగా అసెంబ్లీ సీట్లకు దరఖాస్తులు చేసుకోవాలని బి‌జే‌పి రూల్ పెట్టడంతో..అంబర్ పేట్ నుంచి బి‌జే‌పి సీటు ఆశిస్తూ కొందరు దరఖాస్తులు కూడా పెట్టుకున్నారని తెలిసింది.

అంటే అక్కడ కిషన్ రెడ్డిని కాదని పోటీ చేయడానికి కొందరు నేతలు రెడీ అయ్యారు. అయితే దీనికి కారణం కిషన్ రెడ్డి మళ్ళీ ఎంపీగానే పోటీ చేయాలని భావిస్తున్నారట. అసెంబ్లీలో మాత్రం తన భార్యని నిలబెట్టాలని చూస్తున్నారట. ఇక కిషన్ రెడ్డి సైడ్ అయినప్పుడు..ఇంకా తాము ఎందుకు పోటీ చేయకూడదని కొందరు నేతలు చూస్తున్నారు.

అదే సమయంలో అంబర్‌పేట్ పరిధిలో ఇద్దరు కార్పొరేటర్లు బి‌జే‌పికి షాక్ ఇచ్చి..బి‌ఆర్‌ఎస్ వైపు వెళ్లాలని చూస్తున్నారట. ఈ పరిణామాలు కిషన్ రెడ్డికి తలనొప్పిగా మారాయి. ఇలాగే వదిలేస్తే అంబర్‌పేట్ లో కిషన్ రెడ్డికి ఎదురుదెబ్బలు తప్పవు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version