ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ వల్ల మనిషి జీవన స్థితి ఒక్కసారిగా మారిపోయింది. దాదాపు అన్ని దేశాలలో వ్యాపించి ఉన్న ఈ వైరస్ వల్ల ఎక్కువగా ఇటలీలో మరియు స్పెయిన్ లో మరణాలు చోటుచేసుకున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో ఊహించని విధంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాలో లాక్ డౌన్ విధించడం జరిగింది. ఎవరు ఊహించని విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయానికి చాలామంది జీవితాలు అస్తవ్యస్తం అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయానికి దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.
పనులు లేకపోవటంతో ఇంటికి వెళ్దాం అన్నా బస్సులు లేకపోవడంతో…చాలామంది కాలినడకన కొన్ని వందల కిలోమీటర్లు నడవడానికి రెడీ అయిపోయారు. దీంతో మార్గంమధ్యలో తిండి లేక పోవటం తో పాటుగా నీళ్లు కూడా లేకపోవడంతో వైరస్ కంటే ఎక్కువగా వలస కూలీలు చనిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ పరిస్థితి ఎవ్వరూ కల్లో కూడా ఊహించని విధంగా ఉంది. చాలా సరిహద్దులలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వలసకూలీల పరిస్థితి చాలా దారుణంగా మారింది.