మిస్టర్ నత్వానీ .. ఇదేనా నీ విశ్వాసం ?

-

విభజన తో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోంది. అప్పుల ఊబిలో పూర్తిగా కోల్పోయిన రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి గా ఎన్నికైన వైయస్ జగన్ అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ మహామారి దెబ్బకి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా పడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.అయినా కానీ ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా రేషన్ విషయంలో గాని ఆర్థికంగా ఆదుకునే విషయంలో గానీ జగన్ బాగానే నెట్టుకొని వస్తున్నారు. మరోపక్క కేంద్ర పెద్దలను సాయం అడుగుతున్నాడు. ప్రధాని మోడీ తో గానీ మరియు కేంద్ర మంత్రులతో భేటీ అయిన సందర్భంలో గాని ప్రతిసారి రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది విభజన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు ఆదుకోవాలని జగన్ ఎప్పటికప్పుడు కేంద్రాన్ని ప్రతిపాదిస్తున్నారు.

 

అయినా గాని కేంద్రం నుండి ఎటువంటి సహాయం అందలేదు. ఇటువంటి తరుణంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎంపికైన అంబానీ నమ్మినబంటు నత్వాని ఇప్పటివరకు స్పందించకపోవడం పట్ల విమర్శలు వినబడుతున్నాయి. కేవలం పదవి తీసుకుని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభకు వెళ్తున్న నత్వాని కి ఆంధ్రప్రదేశ్ కష్టాలు కనబడటం లేదా అని విమర్శలు చేస్తూ, మిస్టర్ నత్వానీ .. ఇదేనా నీ విశ్వాసం అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దేశంలోనే నెంబర్ వన్ ఐశ్వర్యవంతుడు అనిల్ అంబానీ నమ్మిన బంటుగా ఉంటూ, ఏపీ నుండి సహాయం పొందుకున్న నత్వానీ…మీ వల్ల రాష్ట్రానికి ఏం లాభం అయ్యా…ఇటువంటి టైం లో కూడా మానవత్వం ఉండవా..?, కేవలం పదవులు మాత్రమేనా అంటూ మరికొంతమంది ఏకిపారేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version