కూకట్‌పల్లిలో బండి సంజయ్‌కి వ్యాక్సిన్‌ వేశా..!

-

కార్పొరేషన్‌ ఎన్నికల్లో నాలుగు ఓట్లు రాబట్టేందుకు బీజేపీ నాయకులు అర్థంపర్థం లేని మాటలు ఆడుతున్నారని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఖమ్మం పర్యటనలో చేసిన వ్యాఖ్యాలకు మంత్రి దీటుగా సమాధానం ఇచ్చారు. ఎన్నికల సమయం కావడంతో కొందరు యాత్రికులు వస్తుంటారని రెండ్రోజుల క్రితం ఇక్కడకు ఓ బత్తాయి ( బండి సంజయ్‌) వచ్చి మోసపూరిత మాటలతో ఓట్లు రాబట్టేందుకు యత్నించారన్నారు. ‘టీఆర్‌ఎస్‌పై కరోనా వ్యాక్సిన ప్రయోగించాం’ అని ఇటీవల బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యాలకు సమాధానంగా.. ఖమ్మం ప్రజలకు నిరోధక శక్తి ఎక్కువగా ఉందని ఇక్కడ ఎలాంటి వ్యాక్సిన్లు పని చేయవన్నారు. ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూకట్‌పల్లి డివిజన్‌లో ఉన్న ఏడు కార్పొరేటర్‌ సీట్లల్లో ఆరింటిని కైవసం చేసుకొని ‘ బండి సంజయ్‌కు నేనే అక్కడ వ్యాక్సిన్‌ వేశానన్నారు.’

2023 కాదు.. ఇప్పుడే నిరూపించు..

బండి సంజయ్‌ కార్పొరేటర్‌ కాక ముందే మమత ఆస్పత్రి ఏర్పాటైందని ఈ విషయం ఆయన గుర్తించుకోవాలన్నారు. ఈ ఆస్పత్రి ద్వారా లక్షమందకి సేవలందిస్తున్నామని, అలాంటి ఆస్పత్రిపై ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. నాపై చేసిన ఆరోపణలు 2023 వరకు ఎందుకు.. దమ్ముంటే ఇప్పుడు నిరూపించాలని చాలెంజ్‌ చేశారు. ఖమ్మంలో మాకు ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీఅని, బీజేపీ మాకు పోటీయే కాదన్నారు. ఖమ్మంకు స్మార్ట్‌సిటీ ప్రకటించాలని బీజేపీ ప్రభుత్వానికి అడిగితే స్పందించలేదని.. అలాంటి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని మంత్రి ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version